రూ.25 కోట్ల క్లబ్‌లోకి ‘కాంతార’ (Kantara).. తెలుగులో కొనసాగుతున్న రిషబ్ శెట్టి (Rishab Shetty) మూవీ ప్రభంజనం

రిషబ్ శెట్టి (Rishab Shetty) నటించిన ‘కాంతార’ (Kantara) మూవీ తెలుగు నాట రికార్డు స్థాయి వసూళ్లతో దూసుకెళ్తోంది

కన్నడ మూవీ ‘కాంతార’ (Kantara) చిత్రం సంచలనాలు కొనసాగుతున్నాయి. చిన్న సినిమాగా విడుదలైన ‘కాంతార’.. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల జాతర చేస్తోంది. రిలీజైన 23 రోజుల్లో రూ.200 కోట్ల మార్కును చేరుకున్న ఈ మూవీ.. కన్నడ నాట హయ్యెస్ట్ గ్రాసర్స్‌లో మూడో ప్లేస్‌లో నిలిచింది. తద్వారా ‘కేజీఎఫ్​ 2’, ‘కేజీఎఫ్’ తర్వాత ఎక్కువ కలెక్షన్లు సాధించిన కన్నడ చిత్రంగా ‘కాంతార’ రికార్డు సృష్టించింది. 

పది రోజుల్లో పాతిక కోట్లకు పైగా వసూళ్లు

తెలుగులో కూడా ‘కాంతార’ ప్రభంజనం కొనసాగుతోంది. అక్టోబర్ 15న విడుదలైన ‘కాంతార’ తెలుగు వెర్షన్.. ఇక్కడ విడుదలైన తొలి రోజే బ్రేక్ ఈవెన్ సాధించింది. ఆ తర్వాత కూడా స్టడీ రన్‌ను కొనసాగిస్తూ.. పది రోజుల్లో రూ.27.60 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసింది. షేర్ పరంగా చూసుకుంటే.. ఈ సంఖ్య రూ.15.13 కోట్లుగా ఉంది. చాలా తక్కువ సమయంలో ఈ చిత్రం ఈస్థాయి వసూళ్లను రాబట్టడం గొప్ప విషయంగానే చెప్పాలి. శని, ఆదివారాల్లోనే కాకుండా వీక్ డేస్‌లోనూ మంచి కలెక్షన్లు వసూలు చేయడం వల్లే ఇది సాధ్యమైందని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. 

దీపావళి సినిమాల జోరులోనూ నిలకడగా వసూళ్లు

‘కాంతార’ తెలుగు వెర్షన్‌కు సంబంధించి మేకర్స్ పెద్దగా పబ్లిసిటీ చేయలేదు. అయితే అప్పటికే సోషల్ మీడియాలో సినిమా కన్నడ వెర్షన్ బాగుందనే టాక్ రావడం కలిసొచ్చింది. అలాగే తెలుగులో మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ దగ్గర ‘కాంతార’కు అడ్డు లేకుండా పోయింది. దీపావళికి నాలుగు చిత్రాలు విడుదలైనప్పటికీ ‘కాంతార’ను తెలుగు ప్రేక్షకులు ఆదరించారు. అందుకే ఈ మూవీ పది రోజుల్లోనే పాతిక కోట్ల మార్కును చేరుకుంది. ఈ మూవీ ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. 

ఇకపోతే, శాండల్‌వుడ్ స్టార్ డైరెక్టర్, హీరో రిషబ్ శెట్టి (Rishab Shetty) ‘కాంతార’ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నటిస్తూ తెరకెక్కించారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబాలే ప్రొడక్షన్స్ నిర్మించింది. ‘కాంతార’లో రిషబ్ సరసన సప్తమి గౌడ కథానాయికగా యాక్ట్ చేశారు. అచ్యుత్ కుమార్, కిషోర్, ప్రమోద్ శెట్టి ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. అజనీష్ లోక్‌నాథ్ ‘కాంతార’కు సంగీతాన్ని అందించారు. ఈ సినిమాను తెలుగులో అల్లు అరవింద్ విడుదల చేశారు. 

Read more: ‘కాంతార’ (Kantara)లో వాళ్ల నటనకు చలించిపోయా.. భూతకోల సంప్రదాయాన్ని చిన్నతనంలో చూశా: పూజా హెగ్డే (Pooja Hegde)

You May Also Like These