‘కాంతార’ (Kantara) చిత్రంపై ఇంతలా అభిమానాన్ని చూపిస్తున్న ప్రేక్షకులకు రిషబ్ శెట్టి (Rishab Shetty) ధన్యవాదాలు చెప్పారు. ఈ సినిమా విజయోత్సవ యాత్రలో భాగంగా ముంబైకి చేరుకున్న ఆయన.. మీడియాతో మూవీ విశేషాలను పంచుకున్నారు. ‘కాంతార’పై వస్తున్న విమర్శల పైనా రిషబ్ స్పందించారు. ఎవరి అభిప్రాయాలు వాళ్లవని.. తాను విమర్శలపై ఎలాంటి కామెంట్స్ చేయాలనుకోవడం లేదని ఆయన అన్నారు.
‘కాంతారపై 99.99 శాతం మంది ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ సినిమాను మేం ఎలా తీశాం.. ఇది ఎంతటి ప్రజాదరణ పొందిందనేది అందరికీ తెలుసు. కాబట్టి నెగెటివ్ కామెంట్స్‌కు ఆడియెన్సే సమాధానం చెబుతారు’ అని రిషబ్ శెట్టి చెప్పారు. ‘కాంతార’ చిత్రం సంస్కృతి, సంప్రదాయాలకు సంబంధించిన సినిమా అన్నారు. ఈ సినిమాలోని పాత్రను పోషించాలంటే అక్కడి సంస్కృతిని నమ్మాలని, అర్థం చేసుకోవాలని రిషబ్ పేర్కొన్నారు. తనకు రీమేక్స్‌పై అంత ఆసక్తి లేదన్నారు.
సక్సెస్ టూర్‌లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, తిరుపతి, విశాఖపట్నంలోనూ రిషబ్ శెట్టి పర్యటించారు. ఈ సందర్భంగా తెలుగు ప్రేక్షకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ‘తెలుగు వాళ్లు ‘కాంతార’ను ఇంతలా ఆదరిస్తారని అనుకోలేదు. రెండు వారాల్లో రూ.45 కోట్లు వసూలు చేసింది. దేశవ్యాప్తంగా కూడా ఇలాగే ఆదరిస్తున్నారు. మీ ఆదరాభిమానాలు ఎప్పటికీ ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నా’ అని రిషబ్ శెట్టి చెప్పుకొచ్చారు.
ఇకపోతే, శాండల్‌వుడ్ స్టార్ హీరో, దర్శకుడు రిషబ్ శెట్టి ‘కాంతార’ను స్వీయ దర్శకత్వంలో నటిస్తూ తెరకెక్కించారు. ఈ సినిమాలో ఆయన సరసన సప్తమి గౌడ (Sapthami Gowda) కథానాయికగా యాక్ట్ చేశారు. అచ్యుత్ కుమార్, కిషోర్, ప్రమోద్ శెట్టి ఈ మూవీలో కీలక పాత్రలు పోషించారు. ‘విక్రాంత్ రోణ’ ఫేమ్ అజినీష్ లోక్‌నాథ్ ‘కాంతార’కు సంగీతం అందించారు. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ హోంబాలే ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది.
Read more: నా శరీరం ఇంకా వణుకుతోంది.. సినిమా అంటే ‘కాంతార’ (Kantara)లా ఉండాలి: కంగనా రనౌత్ (Kangana Ranaut)
Follow Us