విశ్వ విఖ్యాత నట సార్వభౌమ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ (N. T. Rama Rao) నాల్గవ కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి మృతి చెందారు. అనారోగ్య సమస్యలతో ఉమామహేశ్వరి (Umamaheswari) ఆత్మహత్య చేసుకున్నారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఉమా మహేశ్వరి ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారని.. ఆమె కూతురు దీక్షిత పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మానసిక సమస్యలే కారణం : కూతురు దీక్షిత
ఉమామహేశ్వరి (Umamaheswari) అనారోగ్య సమస్యలతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. అనారోగ్య, మానసిక సమస్యలతో తన తల్లి ఉమామహేశ్వరి ఆత్మహత్యకు పాల్పడిందని దీక్షిత పోలీసులకు ఫిర్యాదు చేశారు. తల్లి ఆత్మహత్య సమయంలో ఇంట్లో నలుగురమే ఉన్నామన్నారు. ఆగస్టు 1వ తేదీన, మధ్యాహ్నం 12 గంటలకు ఉమామహేశ్వరి తన గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నారని.. భోజనానికి ఎంత పిలిచినా పలకలేదని తెలిపారు. అనుమానంతో తలుపులు తెరిచి చూస్తే, ఫ్యానుకు ఉరివేసుకుని తన తల్లి కనిపించిందన్నారు. దీక్షిత ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు.
రేపు అంత్యక్రియలు
ఉమామహేశ్వరి మరణ వార్తతో నందమూరి కుటుంబసభ్యులు, అభిమానులు ఆమె ఇంటికి చేరుకున్నారు. బాలకృష్ణ (Nandamuri Balarishna), కల్యాణ్ రామ్‌తో పాటు పలువురు కుటుంబ సభ్యులు హుటాహుటిన ఉమామహేశ్వరి ఇంటికి వెళ్లారు. దీక్షితను ఓదార్చారు.
ఉమామహేశ్వరి మృత దేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పోస్టు మార్టం అనంతరం ఉమామహేశ్వరి మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించనున్నారు. రేపు ఉమామహేశ్వరి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆమె కుటుంబ సభ్యులు చెప్పారు.
Read More: N. T. Rama Rao Birth Anniversary: తెలుగు జాతి గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్‌కు వందేళ్లు
Follow Us