'వీర సింహా రెడ్డి' (Veera Simha Reddy) స్పెషల్ అప్డేట్.. 'స్పీకర్లు పగిలిపోవాలా.. థియేటర్లు మోత మోగిపోవాల'!

తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్టేడ్ వచ్చింది. 'మా బావ మనోభావాలు' (Maa Bava Manobhavalu) అంటూ సాగే స్పెష‌ల్ పాట‌కు సంబంధించిన అనౌన్స్ మెంట్ విడుదల చేసింది చిత్ర యూనిట్.

టాలీవుడ్ నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) హీరోగా తెరకెక్కుతున్న మాస్ ఎంటర్‌టైనర్ 'వీర సింహా రెడ్డి' (Veera Simha Reddy). ‘అఖండ’ వంటి భారీ హిట్ తర్వాత ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు బాలయ్య. శ్రుతి హాస‌న్ హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్‌లు నిర్మిస్తున్నారు. గోపిచంద్‌ మలినేని దర్శకత్వం వహిస్తున్నాడు.

కాగా, ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. అయితే, ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాల్లో వేగం పెంచింది. అందులో భాగంగానే ఇటీవలే ఈ చిత్ర టీజర్, 'జై బాలయ్య', 'సుగుణ సుందరి' (Suguna Sundari) పాటలను విడుదల చేశారు. వీటికి మంచి స్పందన లభించింది. 

'సుగుణ సుందరి' పాట అయితే ఓ రేంజ్ లో దూసుకెళుతోంది. యూట్యూబ్ లో రికార్డు స్థాయిలో ఈ మాస్ బీట్ వ్యూస్ ను కొల్లగొడుతోంది. ఇందులో బాలకృష్ణ, శృతి హాసన్ (Shruti Haasan) మధ్య స్టెప్పులు అలరించాయి. అయితే, ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్టేడ్ వచ్చింది. 'మా బావ మనోభావాలు' (Maa Bava Manobhavalu) అంటూ సాగే స్పెష‌ల్ పాట‌కు సంబంధించిన అనౌన్స్ మెంట్ విడుదల చేసింది చిత్ర యూనిట్.

‘న్యూఇయ‌ర్ పార్టీల్లో స్పీక‌ర్లు ప‌గిలిపోవాలా, థియేట‌ర్ల‌లో మోత మోగిపోవాలా’ అంటూ ఓ స్పెష‌ల్ పోస్ట‌ర్‌తో డిసెంబ‌ర్ 24న మధ్యాహ్నం 3:19 నిమిషాలకు ఈ పాట‌ను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు తెలిపింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ఈ పోస్ట‌ర్‌లో బాల‌య్య (Nandamuri Balakrishna) గెట‌ప్ అదిరిపోయింది. 

రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో సాగే ఈ కథలో, కన్నడ నటుడు దునియా విజయ్ విల‌న్‌గా న‌టిస్తుండ‌గా, వర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్ ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తోంది. కాగా ఈ సినిమాకు పోటీగా విడుదల కాబోతున్న మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ను (Waltair Veerayya) కూడా మైత్రీ సంస్థే నిర్మించడం విశేషం. ఒకే సంస్థ నిర్మించిన రెండు సినిమాలు కేవలం రెండు రోజుల వ్యవధిలో విడుదల కానున్నాయి. దీంతో అభిమానులలో ఆసక్తి పెరిగిపోయింది. 

Credits: Twitter
You May Also Like These