అక్కినేని యువ సామ్రాట్ నాగ చైతన్య (Naga Chaitanya) గతేడాది సమంతతో విడిపోయిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్‌గా పేరు తెచ్చుకున్న ఈ జంట విడిపోవడంతో వీరి ఫ్యాన్స్ గుండె బద్దలైంది. వీళ్లు ఎందుకు విడాకులు తీసుకున్నారనే దానిపై ఇంతవరకు స్పష్టత రాలేదు. ఇక సామ్‌తో విడిపోయినప్పటి నుంచి చైతూ వ్యక్తిగత జీవితంపై రకరకాలు రూమర్స్ తెరపైకి వస్తున్నాయి. ‘మేజర్’ బ్యూటీ శోభితా ధూళిపాళ్ల (Sobhita Dhulipala)తో చైతన్య డేటింగ్లో ఉన్నట్లు కొంతకాలంగా సోషల్ మీడియాతోపాటు పలు వెబ్సైట్లలో వార్తలు వస్తున్నాయి.
నాగ చైతన్య, శోభితా ధూళిపాళ్ల ఇద్దరూ ప్రేమలో ఉన్నారనే గాసిప్స్‌ను బలపరుస్తూ పలు ఫొటోలు గతంలో సోషల్ మీడియాలో వచ్చాయి. తాజాగా వీళ్లిద్దరూ కలసి ఉన్న మరో ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. ఇద్దరూ రిలేషన్లో ఉన్నారనే ప్రచారానికి వీరి ఈ కలయిక మరింత బలాన్ని చేకూర్చేలా ఉందని నెటిజన్స్ అంటున్నారు. ఒకవైపు సమంత అనారోగ్యంతో బాధపడుతుంటే.. మరోవైపు చైతన్య ఇలా కొత్త గర్ల్ ఫ్రెండ్‌తో ఆనందంగా సమయాన్ని గడుపుతున్నారని కొందరు నెటిజన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
శోభితతో తను దిగిన ఫొటో వైరల్ అవుతుండటంపై నాగ చైతన్య ఇంకా స్పందించలేదు. దీనిపై శోభిత కూడా రియాక్ట్ కాలేదు. అసలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫొటోలో ఎంతవరకు నిజముంది? ఇది ఇద్దరూ కలసి దిగిన ఫొటోనా లేక ఎడిటింగ్ ఫొటోనా అనేది తేలాల్సి ఉంది. ఇకపోతే, గతంలో ‘లాల్ సింగ్ చడ్డా’ చిత్రం ప్రమోషన్స్‌లో ‘శోభిత ధూళిపాళ్ల పేరు వినగానే ఏం గుర్తొస్తుంది?’ అని ఓ ఇంటర్వ్యూలో ప్రశ్నించగా.. నాగ చైతన్య చిన్న నవ్వు నవ్వేసి సమాధానం దాటవేయడం గమనార్హం.
కాగా, శోభితా ధూళిపాళ్ల వరుస సినిమాలు చేస్తూ బిజీబిజీగా ఉన్నారు. ఈ మధ్య విడుదలైన ‘పొన్నియిన్ సెల్వన్’ చిత్రంలో ఆమె పాత్రకు మంచి మార్కులు పడ్డాయి. ఇక చైతూ ప్రస్తుతం ‘కస్టడీ’ మూవీ చిత్రీకరణలో పాల్గొంటున్నారు. తమిళ టాప్ దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో.. కన్నడ భామ కృతీ శెట్టి కథానాయికగా నటిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
Read more: లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో రికార్డులు క్రియేట్ చేసిన టాప్-5 హీరోయిన్స్
Follow Us