Biggboss Season 6: వీకెండ్ ఎపిసోడ్ లో గెస్ట్‌ల హంగామా.. 12వ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే?

Advertisement
12వ వారం నామినేషన్స్‌లో ఆదిరెడ్డి, శ్రీహాన్ (Shrihan), రాజ్, ఇనయ, ఫైమా, శ్రీసత్య, రోహిత్ ఉన్నారు.

Biggboss Season 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 ముగింపు దశకు చేరుకుంటోంది. ఈ నేపథ్యంలో వీకెండ్ ఎపిసోడ్ లో ఇంటి సభ్యులకు సంబంధించిన గెస్ట్‌ల రాకతో కళకళలాడుతోంది. గత వారం అంతా ఫ్యామిలీ వీక్ ఎపిసోడ్ రంజుగా సాగగా.. ఇప్పుడు బిగ్ బాస్ స్టేజ్ మీదికి మరికొంతమంది వచ్చారు. నేటి ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమో విడుదలయింది. 

ముందుగా ఇనయా సుల్తానా (Inaya Sultana) కోసం ఆమె సోదరుడితో పాటు.. బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ సొహైల్ స్టేజ్ మీదికి వచ్చాడు. రోహిత్ కోసం.. అతని తమ్ముడితో పాటు ఈటీవీ ప్రభాకర్ వచ్చాడు. ఫైమా కోసం ఆమె సిస్టర్‌తో పాటు బుల్లెట్ భాస్కర్ వచ్చాడు. రేవంత్ కోసం ర్యాపర్ రోల్ రైడాతో పాటు.. సింగర్ సాకేత్ వచ్చారు.

Advertisement

ఇదిలా ఉంటే.. 12వ వారం నామినేషన్స్‌లో ఆదిరెడ్డి, శ్రీహాన్ (Shrihan), రాజ్, ఇనయ, ఫైమా, శ్రీసత్య, రోహిత్ ఉన్నారు. ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే.. ఇనయా, రోహిత్, శ్రీహాన్‌ సేఫ్ జోన్‌లోనే ఉన్నారు. అన్ అఫీషియల్ పోల్స్‌లో సైతం వీరే టాప్‌లో ఉన్నారు. మెరీనా బయటకు వెళ్లింది కాబట్టి.. ఆమె ఓట్లు కూడా రోహిత్‌కు పడినట్లు తెలుస్తోంది.

ఇక ఫైమాకు (Faima) ఎవిక్షన్ పాస్ ఉంది. కాబట్టి ఆమె ఎలాగూ తప్పించుకుంటుందని అంతా అనుకుంటున్నారు. మరోవైపు.. శ్రీ సత్యకు విపరీతమైన నెగెటివిటీ ఏర్పడింది. ఆమె కూడా ఎలిమినేట్ కావచ్చని అంతా భావిస్తున్నారు. రాజ్ కూడా డేంజర్ జోన్‌లోనే ఉన్నాడు. ఈ క్రమంలో రాజ్ ఎలిమినేట్ అయినట్టుగా లీకులు వస్తున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియాలంటే ఆదివారం నాటి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. 

 

మరోవైపు.. టాప్ 5లో ఇనయ చేరిపోయింది. ఆదిరెడ్డి (Adi Reddy), సింగర్ రేవంత్ (Singer Revanth), శ్రీహాన్, ఫైమాలు టాప్ 5లో ఉంటారని అర్థమవుతోంది. మరి రానున్న రోజుల్లో ఎలాంటి ఘటనలైనా జరిగి.. ఎవరి గ్రాఫ్ అయినా పడిపోవచ్చు. పైకి లేవచ్చు. మరి ఏం జరుగుతుందన్నది ముందు ముందు చూడాల్సిందే.

Read More: Biggboss Season 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 లో చివరి కెప్టెన్ ఇనయా సుల్తానా (Inaya Sultana)..!

Advertisement
You May Also Like These
Advertisement