Parampara Season 2 : డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో 'పరంపర 2' రికార్డు.. మిలియ‌న్ వ్యూస్ సాధించిన వెబ్ సిరీస్

Advertisement
Parampara Season 2 : మూడు జెనరేషన్ల‌కు సంబంధించిన కథతో రూపొందిన 'పరంపర సీజన్ 2' హిట్ సాధించింది.

Parampara Season 2 : 'ప‌రంప‌ర సీజన్ 2' వెబ్ సిరీస్ (Web Series) ఓటీటీలో దూసుకెళుతుంది. డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్న 'ప‌రంప‌ర సీజన్ 2' రికార్డుల‌ను సృష్టించింది. ఇప్పటి వరకు 250 మిలియన్ మినట్స్ వ్యూస్‌ను సొంతం చేసుకుంది. 'ప‌రంప‌ర సీజన్ 2' వెబ్ సీరిస్‌లో జగపతి బాబు, శరత్ కుమార్, నవీన్ చంద్ర  (Naveen Chandra) కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఎల్ కృష్ణ విజయ్, అరిగెల విశ్వనాథ్  ద‌ర్శ‌క‌త్వంలో జూలై 21న 'పరంప‌ర సీజన్ 2' ఓటీటీలో రిలీజ్ అయింది. ఈ వెబ్ సిరీస్‌ను నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని అభిరుచి నిర్మించారు. 

Advertisement

ప్ర‌తీకారం తీర్చుకునే క‌థ‌గా ప‌రంప‌ర

Parampara Season 2 : పొలిటికల్, రివెంజ్, యాక్షన్ థ్రిల్లర్‌గా ప‌రంప‌ర వెబ్ సిరీస్‌ను తెర‌కెక్కించారు. మూడు జెనరేషన్ల‌కు సంబంధించిన కథతో రూపొందిన 'పరంపర సీజన్ 2' హిట్ సాధించింది. ప‌రంవ‌ర సీజ‌న్ 1 కు మించి ఈ సీజ‌న్ ఓటీటీ ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ పొందింది.సెకండ్ సీజన్‌లోని ఎమోషన్స్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్నాయి.

స్వేచ్చ కోసం.. అధికారం కోసం.. పోగొట్టుకున్న జీవితం మ‌ళ్లీ కావాలంటూ న‌వీన్ చంద్ర చెప్పిన డైలాగులు పేలాయి. జ‌గ‌ప‌తిబాబు (Jagapathi Babu), శ‌ర‌త్‌కుమార్, న‌వీన్ చంద్ర‌ల మ‌ధ్య సాగిన ఘర్ష‌ణ సీన్లు తెగ పాపుల‌ర్ అయ్యాయి.

ఇక ఈ సిరీస్‌లో లీడ్ రోల్ చేస్తున్న జగపతి బాబు (Jagapathi Babu) విషయానికొస్తే, ఆయన ఒకవైపు సినిమాలు చేస్తూనే, ఇలాంటి వెబ్ సిరీస్‌లు కూడా చేస్తున్నారు. ప్రస్తుతం జగపతి బాబు 'సలార్' సినిమాతో పాటు హిందీ సల్మాన్ ఖాన్ (Salman Khan) కథానాయకుడిగా తెరకెక్కుతున్న కభీ ఈద్ కభీ దివాలీ చిత్రంలో కూడా ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. 

Read More: Parampara 2 : 'పరంపర 2' సిరీస్‌లో జగపతిబాబు, శరత్ కుమార్ ! వీరి పాత్రలపై వీక్షకులలో పెరుగుతున్న ఆసక్తి

Advertisement
You May Also Like These
Advertisement