Rithu Chowdary: ప్రేమలో పడ్డ జబర్దస్త్ (Jabardasth) బ్యూటీ రీతూ చౌదరి?.. కాబోయే భర్తను పరిచయం చేస్తూ పోస్ట్!

Advertisement
రీతూ చౌదరి (Rithu Chowdary)

బుల్లితెర కామెడీ షో జబర్దస్త్‌తో (Jabardasth) ఫేమ్‌ సంపాదించిన వారిలో రీతూ చౌదరి ఒకరు. ఈ షో లో స్కిట్స్ చేస్తూ జనాల్లో పాపులారిటీ పెంచుకుంది రీతూ. లేడీ కమెడియన్‌గా సత్తా చాటుకుంటూ.. సోషల్ మీడియాలో తన అందంతో కుర్రకారును ఆకట్టుకుంటోంది ఈ బ్యూటీ. 

ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తూ అట్రాక్ట్ చేస్తుంటుంది. పొట్టి బట్టలతో హాట్ హాట్ ట్రీట్ ఇస్తుండటం ఈ అమ్మడి నైజం. జబర్దస్త్ కమెడియన్‌ అజార్‌తో (Comedian Azar) ప్రేమలో ఉందంటూ పలు స్కిట్లు కూడా చేశారు. వీరిద్దరి మధ్య తెరపై లవ్ ట్రాక్ కూడా నడిపించారు షో నిర్వాహకులు. 

Advertisement

తాజాగా రీతూ చౌదరి (Rithu Chowdary) షేర్ చేసిన ఓ ఫొటో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. తమ బంధం కంటే గొప్పగా ఇంకేదీ ఉండదంటూ రాసుకొస్తూ.. ఈ అందగత్తె ఓ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ పోస్ట్‌తో ఆమె త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతుందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. క్యూట్ కపుల్స్ అంటూ శుభాకాంక్షలు చెబుతున్నారు. 

అయితే ఆమె ఈ విషయాన్ని అధికారికంగా చెప్పలేదు కానీ, ఈ ఫొటోకు రీతూ ఇచ్చిన క్యాప్షన్‌ చూస్తే దాదాపు ఆమె పెళ్లి ఖాయమైనట్లు తెలుస్తోంది. దీంతో ఈ ఫొటోలో రీతూతో ఉన్నది ఎవరా? అన్న ఆసక్తి నెటిజన్స్‌లో మొదలైంది. వివరాల్లోకి వెళితే రీతూతో ఉన్న వ్యక్తి పేరు శ్రీకాంత్‌ అని, అతను సంపన్న వ్యాపారస్థుడని, ప్రస్తుతం రాజకీయాల్లో కూడా బిజీగా ఉన్నాడని టాక్ వినిపిస్తోంది. 

ఆయనకు హైదరాబాద్, బెంగళూరు సిటీల్లో చాలా ఆస్తులు ఉన్నట్లు సమాచారం. దీంతో ఈ విషయం తెలిసి రీతూ (Rithu Chowdary) బాగానే సెట్ చేసుకుందిగా అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది. 

Read More: Jabardasth: 'కామెడీ స్టార్స్' కు త‌గ్గిన రేటింగ్.. త్వ‌ర‌లో మూసుకోవాల్సిందేనా?

Advertisement
You May Also Like These
Advertisement