Shanmukh Jaswanth: 'ఏజెంట్ ఆనంద్ సంతోష్'గా రాబోతున్న షణ్ముఖ్ జస్వంత్.. అదరగొడుతున్న ఫస్ట్ లుక్!

Advertisement
షణ్ముఖ్ జస్వంత్, 'ఏజెంట్ ఆనంద్ సంతోష్' పోస్టర్ (Shanmukh Jaswanth, Agent Anand Santosh Poster)

Shanmukh Jaswanth: యూట్యూబ్‌లో పలు షార్ట్ ఫిలిమ్స్‌తో మంచి గుర్తింపుని తెచ్చుకొని ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్ వరల్డ్‌లో తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్‌ను ఏర్పరుచుకున్నాడు షణ్ముఖ్ జస్వంత్. ఇప్పటికే 'సాఫ్ట్ వేర్ డెవలపర్స్', 'సూర్య' అనే వెబ్ సిరీస్‌లతో షన్ను నెట్టింట్లో తెగ ఫేమస్ అయ్యాడు.

లాక్ డౌన్ సమయంలో షన్ను తన వెబ్ సిరీస్‌లతో, రెండు తెలుగు రాష్ట్రాలను ఊపేశాడు. మోస్ట్  పాపులర్ ఇన్‌ఫ్లూయన్సర్‌గా టాప్ 50 జాబితాలోకి కూడా ఎక్కేశాడు. 

Advertisement

తెలుగు యూట్యూబర్స్‌లో అయితే, అత్యధికంగా ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి కూడా అతనే. ఏకంగా నాలుగు మిలియన్ల సబ్ స్క్రైబర్స్ ఉన్నారు. తన ఛానల్‌లో ఎలాంటి వీడియో పోస్ట్ చేసినా కూడా, ఈజీగా మిలియన్ల వ్యూస్ అందుకుంటున్నాయి. ఆ ఇమేజ్‌తోనే తెలుగు బిగ్ బాస్ సీజన్ 5లో కంటెస్టెంట్‌గా చోటు దక్కించుకొని రన్నరప్‌గా నిలిచాడు షన్ను.

అయితే, బిగ్ బాస్ (Telugu Biggboss) హౌస్ నుంచి వచ్చాక, షణ్ముఖ్ చాలా రోజులు సోషల్ మీడియాకి దూరంగా ఉండిపోయాడు. ఒక రకంగా చెప్పాలంటే దీప్తితో లవ్ బ్రేకప్ వంటి ఇష్యూస్‌తో సైలెంట్ అయిపోయాడు. తర్వాత ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారు. ఇక ఇప్పుడిప్పుడే షణ్ముఖ్ మళ్ళీ రంగంలోకి దిగినట్టు కనిపిస్తోంది.

తెలుగు ఓటీటీ 'ఆహా' (Aha OTT) కోసం షణ్ముఖ్ ఓ వెబ్ సిరీస్ చేస్తోన్న సంగతి తెలిసిందే.  'ఏజెంట్ ఆనంద్ సంతోష్' (ఏఏఎస్) అనే టైటిల్‌తో వెబ్ సిరీస్ ద్వారా, మరోసారి విభిన్నంగా ఆడియెన్స్‌ను ఆకట్టుకోవడానికి రెడీ అయ్యాడు షణ్ముఖ్. 'సోలో బ్రతుకే సో బెటర్' దర్శకుడు సుబ్బు డైరెక్ట్ చేస్తున్న ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించిన ఒక ఇంట్రో కూడా విడుదల చేశారు. ‘

‘చంటబ్బాయికి వారసుడు.. ఆత్రేయకు తమ్ముడు.. పరిహాసంలో కానీ, పరిష్కారంలో కానీ తగ్గేదేలే’’ అంటూ ఏజెంట్ ఆనంద్ సంతోష్‌కు ఇంట్రో విడుదల చేశారు.  ఈ విషయాన్ని 'ఆహా' ఆఫీషియల్ పోస్టర్ ద్వారా వెల్లడించింది. షణ్ముఖ్ ఈ పోస్టర్ (Agent Anand Santosh Poster) లో ఒక సూట్ కేసు పట్టుకుని కనిపిస్తున్నాడు. దాని మీద 'కేసు క్లోజ్డ్‌' అనే లెటర్స్ హైలైట్ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైర‌ల్‌గా  మారింది.

ఇక, ఈ పోస్టర్ చూస్తుంటే ఈ వెబ్ సిరీస్ కూడా సక్సెస్ అయ్యేలా కనిపిస్తోంది. ఇంతకుముందు వెబ్ సిరీస్‌లతో యూట్యూబ్ ద్వారా మంచి ప్రాఫిట్స్ అందుకున్న షన్ను, ఇప్పుడు 'ఆహా' నుంచి అంతకంటే ఎక్కువగా రెమ్యునరేషన్ ఈ ప్రాజెక్ట్ కోసం తీసుకున్నట్లు సమాచారం.

Read More: Anchor Sreemukhi: దుబాయిలో వాలిపోయిన యాంకర్ శ్రీముఖి.. బుర్జ్ ఖలీఫా వద్ద హాట్ హాట్ పోజులు!

Advertisement
You May Also Like These
Advertisement