Biggboss Season6: తెలుగు బిగ్‌బాస్ సీజన్ 6 ఆఖరి ఘట్టానికి తెరలేచింది. మరో నాలుగు రోజుల్లో ఈ సీజన్ ముగియనుంది. దీంతో ఇప్పటికే విన్నర్ కు సంబంధించిన ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయ్యాయి. ప్రస్తుతం హౌస్ లో ఆరుగురు కంటెస్టెంట్లు ఉన్నారు. రేవంత్, రోహిత్, శ్రీహాన్, శ్రీసత్య, కీర్తి, ఆదిరెడ్డి.. ఈ ఆరుగురిలో ఎవరు గురువారం నాడు ఎలిమినేట్ అవుతారన్నదానిపై ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. బిగ్ బాస్ (Telugu Biggboss) చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందని హోస్ట్ నాగార్జున వీకెండ్ ఎపిసోడ్ లోనే అధికారికంగా ప్రకటించారు. అదేవిధంగా బుధవారం అర్ధరాత్రి వరకు వచ్చిన ఓట్ల ఆధారంగానే ఈ ఎలిమినేషన్ ఉంటుందని అన్నారు. ఈ నేపథ్యంలో నేడు హౌస్ నుంచి ఒకరు ఎలిమినేట్ కాబోతున్నారని తెలుస్తోంది.
దీంతో ఆరుగురు కంటెస్టెంట్లలో ఎవరు ఎలిమినేట్ అవుతారన్నదానిపై చర్చ మొదలైంది. ప్రస్తుతానికి హౌస్ లో ఆరుగురు సభ్యులుండగా.. ఆరుగురి జర్నీలను బుధవారం ఎపిసోడ్ వరకు బిగ్ బాస్ ఎంతో అందంగా చూపించాడు. ఇక, ఇదిలా ఉంటే.. డేంజర్ జోన్‌లో ఉన్నది మాత్రం శ్రీసత్య (Sri Satya), కీర్తిలే. ఓటింగ్ ప్రకారం చూస్తే ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్ కావాలి. దీంతో ప్రస్తుతం అందుతున్న లీక్ ప్రకారం గురువారం శ్రీ సత్య ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇక, గతవారం నుంచి ఆదిరెడ్డి (Adi Reddy) ఓటింగ్ పర్సెంటేజ్ బాగా తగ్గిపోవడంతో.. బిగ్ బాస్ మేనేజ్ మెంట్ ఆదిరెడ్డిని విన్నర్ గా కాకుండా టాప్ 3లో ఉంచాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇక, మిగిలిన వారిలో రేవంత్, శ్రీహాన్, కీర్తి, రోహిత్ లలో ఎవరు విన్నర్ కావచ్చు. అయితే.. వీరిలో కూడా రేవంత్, శ్రీహాన్ లకే ఆ ఛాన్స్ ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ వీరిద్దరూ కాదంటే రోహిత్ కూడా విన్నర్ అయ్యే అవకాశం ఉంది.
రోహిత్ (Rohit) ఫ్యాన్స్ ఆయన గురించి పోస్టులు పెడుతున్నారు. ఎక్కడ తగ్గాలో, ఎక్కడ నెగ్గాలో.. ఎవరితో ఎలా మాట్లాడాలి? ఇలా విన్నర్ కు కావాల్సిన క్వాలిటీస్ అన్నీ అతనిలో ఉన్నాయని అంటున్నారు. దీంతో ఓటింగ్ ప్రకారం చూస్తే రోహిత్ టాప్ 3లో ఉన్నాడు. అన్అఫీషియల్ పోల్స్‌లో రోహిత్‌కి జెన్యూన్ ఆడియన్స్ మద్దతు ఎక్కువగా ఉంది.
Follow Us