అమెజాన్‌లో యశ్‌ (Yash) కేజీఎఫ్‌2.. ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌ ఉంటే ఫ్రీగా చూసేయచ్చు

కేజీఎఫ్‌2 సినిమాలో యశ్‌ (Yash)

బాక్సాఫీసు దగ్గర వసూళ్ల సునామీ సృష్టించింది యశ్‌ హీరోగా వచ్చిన ‘కేజీయఫ్‌: చాప్టర్‌2’. యశ్‌(Yash) హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన మాస్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ రూ.1200 కోట్లకు పైగా వసూలు చేసింది. ఓటీటీలోకి ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా? అని ఎదురు చూస్తున్న అభిమానులకు గుడ్‌ న్యూస్‌ వచ్చేసింది. ప్రస్తుతం అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో ‘కేజీయఫ్‌2’ తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో అందుబాటులో ఉంది.  ఈ సినిమా ఇప్పటికిప్పుడే చూడాలంటే మాత్రం ఎర్లీ యాక్సెస్‌ కోసం అదనంగా రూ.199 చెల్లించాలని షరతు పెట్టింది అమెజాన్. దీంతో ఓటీటీలో ‘కేజీయఫ్‌2’ వచ్చేసిందని ఆనందపడిన వాళ్లు షాక్‌తోపాటు నిరాశకు సైతం గురయ్యారు.

షరతుల్లేవ్.. 

కేజీయఫ్‌2’ చూడాలంటే సినిమాను అద్దెకు తీసుకోవాలి. ఇందుకు రూ.199 చెల్లించాలి. ఒకసారి సినిమాను అద్దెకు తీసుకున్న తర్వాత 30 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే ఒకసారి సినిమా చూడటం మొదలుపెట్టిన తర్వాత 48 గంటల్లో గడువు పూర్తయిపోతుంది. ‘కేజీయఫ్‌2’ అద్దెకు తీసుకుని, చూడటం మొదలు పెడితే 48 గంటల్లో సినిమా పూర్తిగా చూసేయాలని షరతు విధించింది. అయితే ఇప్పుడు ఆ షరతులను ఎత్తేస్తూ.. శుక్రవారం నుంచి ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ఉన్నవాళ్లు కేజీఎఫ్‌2ను ఉచితంగా చూడొచ్చు.  

ఇక,  హోంబ‌లే ఫిలిమ్స్ పతాకంపై విజ‌య్ కిర‌ంగదూర్ కేజీఎఫ్‌2 సినిమా నిర్మించారు. ఏప్రిల్ 14వ తేదీన  ప్రపంచవ్యాప్తంగా సుమారు పది వేల థియేటర్లలో సినిమాను రిలీజ్ చేశారు. క‌న్నడ‌, హిందీ, త‌మిళ, తెలుగు, మ‌ళ‌యాళ భాషల్లో రిలీజైన ఈ సినిమా విడుద‌లైన నాలుగు రోజుల్లోనే రూ.546 కోట్లు వసూలు చేసింది. రెండో వారంలో రూ.వెయ్యి కోట్ల వరకు వసూలు చేసి రికార్డు సృష్టించింది కేజీఎఫ్‌2.

ఉత్తరాదిలో కేజీఎఫ్‌2 రూ.350 కోట్లు వ‌సూళ్లు చేసిందంటే మామూలు విష‌యం కాదు.  హిందీ సినిమాల చ‌రిత్రలోనే ఇంత పెద్ద మొత్తంలో ఏ సినిమా వ‌సూళ్లు రాబట్టలేదని టాక్. ప్రతి రోజూ క‌లెక్షన్ల సునామీ పెరుగుతూనే ఉంది కానీ... రాఖీభాయ్‌కి అడ్డు వెళ్లే ద‌మ్ము ఉన్న సినిమా రాద‌ని సినీ వ‌ర్గాల్లో చర్చ నడుస్తోంది. య‌శ్(Yash) అభిమానుల వ‌ల్లే ఇదంతా సాధ్యమైంద‌ని అంటున్నారు.

 

Read More: కాస్త లేటైంది అంతే.. అక్క‌డ కేజీఎఫ్ చాప్ట‌ర్‌2 (KGF Chapter 2) ద‌మ్మేంటో ఇప్పుడు తెలిసింది

You May Also Like These