Pawan Kalyan : పవన్ కళ్యాణ్ హీరోగా 'విరాట పర్వం' డైరెక్టర్ వేణు ఊడుగుల చిత్రం ! ఇందులో నిజమెంత ?

పవన్ కల్యాణ్, వేణు ఊడుగుల (Pawan Kalyan, Venu Udugula)

ఇటీవ‌లే విరాట‌ప‌ర్వం (Virata Parvam) సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చాడు టాలీవుడ్ యువ ద‌ర్శ‌కుడు వేణు ఊడుగుల. దాదాపు మూడు సంవత్సరాలు రిలీజ్ కోసం వెయిట్ చేసిన ఈ చిత్రం బాక్సాపీస్ వ‌ద్ద మంచి టాక్ తెచ్చుకుంది.

రానా, సాయి పల్లవి కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. ఒక విప్లవాత్మక ప్రేమకథగా ఈ సినిమాను తెరకెక్కించాడు వేణు ఊడుగుల. ఈ మూవీలో రానా, సాయి పల్లవి యాక్టింగ్‌తో పాటు వేణు ఊడుగుల (Venu Udugula) డైరెక్షన్ కూడా ప్రేక్షకులను ఇంప్రెస్ చేసింది. 

అయితే, ఈ సినిమా విడుద‌ల‌కు ముందే డైరెక్టర్ వేణు.. స్టార్ హీరో ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు (Pawan Kalyan) ఓ క‌థ వినిపించాడ‌ని వార్తలు వినిపిస్తున్నాయి. ఆ సినిమాకు ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా గ్రీన్ సిగ్న‌ల్ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది.

కాగా, పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం ఓ వైపు రాజకీయాలను, మరోవైపు సినిమాలను సమానంగా బ్యాలెన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. 'వకీల్ సాబ్' (Vakeel Saab Movie) చిత్రంతో తన సెకండ్ ఇన్నింగ్స్‌ను గ్రాండ్‌గా ప్రారంభించిన పవన్.. ఆ మూవీ హిట్ అవ్వడంతో బ్యాక్ టు బ్యాక్ చిత్రాలకు సైన్ చేశాడు. 

అయితే త్వరలోనే మళ్లీ రాజకీయాల్లో బిజీ కానున్న పవన్.. తన అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్‌ను ఎలా పూర్తి చేస్తాడా అన్న అనుమానాలు వ్యక్తమవుతుండగా.. ఇప్పుడు మరో మూవీకి తను గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడన్న వార్త వైరల్‌గా మారింది. విరాటపర్వం విడుదల అవ్వకముందే వేణు ఊడుగుల.. పవన్ కళ్యాణ్‌కు ఓ కథ వినిపించాడట. ఆ కథ పవన్‌కు బాగా నచ్చిందట కూడా.

అయితే చేతిలో ఉన్న సినిమాలనే ఇంకా పూర్తి చేయని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan).. వేణు ఊడుగులతో సినిమా చేయడానికి ఇంకెంత సమయం పడుతుందో అని ప్రేక్షకులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ కాంబినేషన్ కచ్చితంగా సెట్స్‌పైకి వెళ్తుందా లేదా అన్న విషయం ఇప్పుడే చెప్పలేం.

ఇపుడున్న ప‌రిస్థితులను చూస్తుంటే ఈ సినిమా ప‌ట్టాలెక్కే ఛాన్స్ దాదాపు లేన‌ట్టేననిపిస్తుంద‌ని  చ‌ర్చించుకుంటున్నారు సినీ జ‌నాలు. జ‌న‌సేన అధినేత అయిన ప‌వ‌న్ క‌ల్యాణ్..  మ‌రోవైపు అక్టోబ‌ర్ నుంచి పొలిటిక‌ల్ టూర్ ప్లాన్ రెడీ చేసుకున్న సంగ‌తి తెలిసిందే.

ప్ర‌స్తుతం ప‌వ‌న్ చేతిలో క్రిష్ తో చేస్తున్న‌ హ‌రిహ‌రవీర‌మ‌ల్లు (Hari Hara Veera Mallu), హ‌రీష్ శంక‌ర్ డైరెక్ష‌న్‌లో భ‌వ‌దీయుడు భ‌గ‌త్ సింగ్ (Bhavadeeyudu Bhagat Singh).. ఈ రెండు సినిమాలే ఉన్నాయి. 

Read More: పవన్ కల్యాణ్‌ (Pawan Kalyan) సినిమాలో ఛాన్స్ కొట్టేసిన రొమాంటిక్ హీరోయిన్ కేతిక శర్మ!

You May Also Like These