సరికొత్త సబ్జెక్టులకు కేరాఫ్ అడ్రస్ నాగశౌర్య (Naga Shaurya)... ఈ హీరో గురించిన టాప్ 10 విశేషాలు ఇవే !

నాగశౌర్య (Naga Shaurya) తన తల్లి ఉషా ముల్పూరి నిర్మాణ సారధ్యంలో ఇటీవలే 'కృష్ణ వ్రింద విహారి' చిత్రంలో నటించారు

నాగశౌర్య (Naga Shaurya) .. టాలీవుడ్ యువ నటుడు. కానీ సరికొత్త సబ్జెక్టులతో ప్రయోగాలు చేయడంలో ఈయన దిట్ట. ఛలో, ఊహలు గుసగులాడే, నర్తనశాల, దిక్కులు చూడకు రామయ్య, జ్యో అచ్యుతానంద, లక్ష్య, వరుడు కావలెను.. ఇలా ఏ సినిమా చూసినా.. ఇతను నటించిన చిత్రాలలో ఏదో ఒక కొత్తదనం ఉంటుంది.

ఈ రోజే నాగశౌర్య నటించిన 'కృష్ణ వ్రింద విహారి' రిలీజ్ అయ్యింది. ఈ సందర్భంగా ఈ యువ నటుడు గురించిన టాప్ టెన్ విశేషాలు మీకోసం ప్రత్యేకం

ఏలూరు కుర్రాడు
నాగశౌర్య (Naga Shaurya) పుట్టి, పెరిగింది అంతా ఏలూరులోనే. కానీ తర్వాత ఈయన కుటుంబం విజయవాడకు షిఫ్ట్ అయ్యింది. నటన పట్ల ఎంతో ఆసక్తి కలిగిన నాగశౌర్య అవకాశాల కోసం హైదరాబాద్ నగరానికి చేరుకున్నాడట. 

టెన్నిస్ ప్లేయర్‌గా గుర్తింపు
నటనా రంగంలోకి రాకమునుపు నాగశౌర్య (Naga Shaurya) టెన్నిస్ ఆటగాడిగా కూడా మంచి గుర్తింపు పొందాడట. ఎన్నో టోర్నమెంట్లలో ఆయన విజేతగా కూడా నిలిచాడు. 

ఎన్జే భిక్షు వద్ద శిక్షణ
ప్రముఖ యాక్టింగ్ స్కూల్ నిర్వాహకులు ఎన్జే భిక్షు గారి వద్ద నాగశౌర్య (Naga Shaurya) చాలా సంవత్సరాలు శిక్షణను పొందారు. నటనలోని మెళకువలను ఆ విధంగా నేర్చుకున్నారు. 

అనుకోని అవకాశం
అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో 'ఊహలు గుసగుసలాడే' చిత్రంలో నాగశౌర్యకు (Naga Shaurya) అనుకోకుండా అవకాశం వచ్చిందట. కొత్త నటులు కావాలని చెబుతూ వారాహి చలనచిత్రం ఇచ్చిన ప్రకటనకు స్పందించి, ఈయన కూడా తన ప్రొఫైల్ పంపించారట. కానీ లక్ కలిసివచ్చి, ఆ చిత్రంలో హీరోగా ఛాన్స్ వచ్చిందట. అంతకుముందే     క్రికెట్ గార్ల్స్ అండ్ బీర్, చందమామ కథలు అనే చిత్రాలలో నటించారు నాగశౌర్య.

సొంత నిర్మాణ సంస్థతో
నాగశౌర్య తన సొంత నిర్మాణ సంస్థ ఇరా క్రియేషన్స్ (Ira Creations) ద్వారా, తన తల్లిగారు ఉషా ముల్పూరి సారధ్యంలో కూడా పలు చిత్రాలను నిర్మించారు. ఛలో, అశ్వద్ధామ, నర్తనశాలతో పాటు.. ప్రస్తుతం 'కృష్ణ వ్రింద విహారి' చిత్రాన్ని కూడా ఆయనే నిర్మించారు. 

కెరీర్‌లో బెస్ట్ చిత్రాలు
ఊహలు గుసగుసలాడే, జ్యో అచ్యుతానంద, అశ్వద్ధామ, ఛలో, ఓ బేబీ, కళ్యాణ వైభోగమే మొదలైనవి నాగశౌర్య కెరీర్‌లో ఉత్తమ చిత్రాలుగా నిలిచిపోతాయి. 

హారర్ చిత్రంలో
ఏఎల్ విజయ్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషలలో తెరకెక్కిన 'కణం' చిత్రంలో సాయిపల్లవి సరసన నాగశౌర్య నటించారు. ఈ చిత్రం 'దియా' పేరిట తమిళంలో విడుదలైంది. 

తదుపరి ప్రాజెక్టులు
ప్రస్తుతం నాగశౌర్య చేతినిండి ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి, నారీ నారీ నడుమ మురారి, పోలీస్ వారి హెచ్చరిక మొదలైన చిత్రాలలో ఆయన నటిస్తున్నారు. 

ఓటీటీలో రికార్డ్స్
నాగశౌర్య నటించిన వరుడు కావలెను, లక్ష్య .. ఈ సినిమాలు రెండూ కూడా ఓటీటీలలో రికార్డు స్థాయిలో వీక్షకులను పొందడం విశేషం. థియేటర్ ప్రేక్షకులను పెద్దగా అలరించని ఈ చిత్రాలు, ఓటీటీలో మాత్రం దుమ్మురేపాయి. 

ఎన్నో అంచనాలు మధ్య 'కృష్ణ వ్రింద విహారి'
నాగశైర్య కథానాయకుడిగా నటించిన 'కృష్ణ వ్రింద విహారి' (Krishna Vrinda Vihari) కు ఓపెనింగ్స్ బాగానే వచ్చాయని టాక్. మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా ఈ చిత్రం కితాబునందుకుంటోంది. 

ఇవండీ.. యంగ్ అండ్ టాలంటెడ్ హీరో నాగశౌర్య గురించిన ముచ్చట్లు

Read More : 'కృష్ణ వ్రింద విహారి' ప్రీరిలీజ్ ఈవెంట్‌లో డ్యాన్సులతో అలరించిన నాగ‌శౌర్య (Naga Shourya), షెర్లీ సెటియా !

You May Also Like These