నందమూరి తారకరాామారావు తనయుడిగా బాలకృష్ణ (Balakrishna) తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయమయ్యారు. తండ్రి నటన వారసత్వాన్ని బాలకృష్ణ కొనసాగిస్తున్నారు. బాలకృష్ణ సినిమాలంటే అప్పటికీ ఇప్పటికీ ప్రత్యేకమైనవే. ఇండస్ట్రీలో బాలకృష్ణను అభిమానించే వాళ్లందరూ బాలయ్య అని పిలుస్తుంటారు. 'బాలయ్య' పేరుతో పాటలు రాసి బాలకృష్ణపై అభిమానాన్ని చాటుకున్నారు కొందరు సినీ రచయితలు. బాలయ్య పేరుతో వచ్చిన సూపర్ హిట్స్ సాంగ్స్‌పై పింక్ విల్లా ప్రత్యేక కథనం.
లారీడ్రైవర్
'లారీడ్రైవర్' సినిమా 1990లో విడుదలైంది. ఈ సినిమాలో బాలకృష్ణ (Balakrishna), విజయశాంతి హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రానికి బి. గోపాల్ దర్శకత్వం వహించగా.. ఎస్. జయరామారావు నిర్మాతగా వ్యవహరించారు.
'లారీడ్రైవర్' చిత్రంలోని 'బాలయ్య బాలయ్య... గుండెల్లో గోలయ్య' అనే పాట బాలయ్య పేరుతో వచ్చిన మొదటి పాట. ఈ సినిమాకు బప్పీలహరి సంగీతం అందించగా.. సిరివెన్నెల సీతారామశాస్త్రి లిరిక్స్ రాశారు.
బంగారు బుల్లోడు
1993లో విడుదలైన 'బంగారు బుల్లోడు' సినిమా బాలకృష్ణకు బ్లాక్ బాస్టర్ హిట్ ఇచ్చింది . ఈ సినిమాలో రమ్యకృష్ణ, రవీనా టాండన్ హీరోయిన్లుగా నటించారు. రవీనా టాండన్ తెలుగులో మొదటి సారి నటించిన సినిమా 'బంగారు బుల్లోడు'. ఈ సినిమాలో 'తకిదినితోం తకిదినితోం బాలయ్యో.. ఇటు రావయ్యో' పాట హైలెట్‌గా నిలిచింది.
ఈ చిత్రానికి రాజ్ కోటి సంగీతం సమకూర్చారు. భువన చంద్ర లిరిక్స్ అందించారు. 'బంగారు బుల్లోడు' సినిమాకు దర్శకుడు రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహించగా.. జగపతి ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్‌పై వి.బి. రాజేంద్రప్రసాద్ నిర్మించారు.
నరసింహానాయుడు
2001లో రిలీజ్ అయిన 'నరసింహానాయుడు' బాలకృష్ణకు సూపర్ హిట్ అందించింది. ఈ సినిమాలో 'లక్స్ పాప.. లక్స్ పాప లంచ్‌కొస్తావా' పాట అప్పట్లో దుమ్ము రేపింది.ఈ పాటకు మణిశర్మ సంగీతం సమకూర్చారు. భువన చంద్ర లిరిక్స్ రాశారు. 'లక్స్ పాప' పాటను ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించారు. 'లక్స్‌పాప' పాటలో 'హరేరామ హరేకృష్ణా.. బెండుతీసేయ్ బాలకృష్ణా' లైన్ ఓ రేంజ్‌లో ఫేమస్ అయింది.
ఫ్యాక్షన్ నేపథ్యంలో రిలీజ్ అయిన 'నరసింహానాయుడు' తెలుగు సినిమా రికార్డులను బద్దలు కొట్టింది. అగ్ర హీరోలంతా బాలకృష్ణ బాటలో ఫ్యాక్షన్ సినిమాలలో నటించిడం మొదలు పెట్టారు.
అఖండ
'అఖండ' సినిమాలో 'జై బాలయ్య..' పాట చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరినీ ఆకట్టుకుంది. 'యా యా జై బాలయ్య' అనే పాట థియేటర్లను ఓ ఊపు ఊపేసింది. బాలకృష్ణ, ప్రగ్యా జైస్వాల్ మాస్ డాన్సులు అందిరినీ ఆకట్టుకున్నాయి. బాలకృష్ణ షర్టులు మార్చే స్టెప్పు అప్పట్లో వైరల్‌గా మారింది. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ స్వరపరిచిన 'జై బాలయ్య' పాట సినిమాకే హైలెట్‌గా నిలిచింది.
దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో 'అఖండ' సినిమా 2021లో విడుదలైంది. మిర్యాల రవీంద్రారెడ్డి నిర్మాతగా వ్యవహరించారు.
వీరసింహారెడ్డి
బాలకృష్ణ నటిస్తున్న 'వీరసింహారెడ్డి' సినిమా నుంచి ఇటీవలే ఓ పాట విడుదలైంది. ఈ సినిమాలో పాట 'రాజసం నీ ఇంటి పేరు.. పౌరుషం నీ ఒంటి పేరు.. జై బాలయ్య.. జై బాలయ్య.. అంటూ సాగింది. పాటల రచయిత రామజోగయ్యశాస్త్రి బాలయ్య ఫ్యాన్స్‌ని దృష్టిలో పెట్టుకునే పదాలు రాశారట. తమన్ 'అఖండ' సినిమా తరువాత జై బాలయ్య పాటను స్వరపరిచారు.
గోపిచంద్ మలినేని దర్శకత్వంలో వీరసింహారెడ్డి తెరకెక్కుతోంది. ఈ సినిమా వచ్చే సంక్రాంతికి విడుదల కానుంది.ఈ చిత్రాన్ని నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ మైత్రీ మూవీమేకర్స్ పతాకంపై సంయుక్తం నిర్మిస్తున్నారు.
Read More: 1 Year For Akhanda: 'అఖండ' విడుదలై ఏడాది.. బాలకృష్ణ (Balakrishna) నటనకు దద్దరిల్లిన థియేటర్లు
Follow Us