కమల్ హాసన్ (Kamal Haasan) నటించిన విక్రమ్ (Vikram) సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ సాధించింది. విక్రమ్ సినిమా క్లైమాక్స్ సమయంలో ఈ మూవీ సీక్వెల్ కూడా ఉంటుందని దర్శకుడు లోకేష్ కనగరాజ్ హింట్ ఇచ్చారు. ఇక నటుడు 'సూర్య' విక్రమ్ సినిమాలో రోలెక్స్ పాత్రతో సడెన్‌గా ఎంటరై అందరికీ అనుకోని షాక్ ఇచ్చారు.
ఇక సూర్యనే 'విక్రమ్ 2' విలన్ అనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈ క్రమంలో ఈ సినిమా పై అనేక ఆసక్తికరమైన సంగతులు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
ఖైదీ 2.. విక్రమ్ 2.. ఈ రెండు చిత్రాలకు విలన్ ఒక్కరేనా? మరి రామ్ చరణ్ 'విక్రమ్ 2' చిత్రంలో ఏ పాత్రలో కనిపిస్తారు? 'విక్రమ్ 2' పై డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ప్లానింగ్ ఎలా ఉంది? లాంటి ప్రశ్నలు కూడా సినీ అభిమానులలో తలెత్తుతున్నాయి.
కమల్ హాసన్‌కు (Kamal Haasan) తాను వీరాభిమానిని అని చెబుతూ ఉంటారు దర్శకుడు లోకేష్ కనగరాజ్. అప్పుల్లో కూరుకుపోయిన కమల్ హాసన్ కు (Kamal Haasan) 'విక్రమ్' కలెక్షన్ కొత్త సంతోషాన్ని తెచ్చిపెట్టింది.
'విక్రమ్' (Vikram) సక్సెస్ తర్వాత, కమల్ హాసన్ ప్రతీ ఒక్కరికీ సర్‌ప్రైజ్ కానుకలను అందిస్తూ, తన టీమ్‌ను ఆనందపరిచారు. ఇదే క్రమంలో 'విక్రమ్ 2' కోసం కమల్ హాసన్‌తో పాటు లోకేష్ కనగరాజ్ కూడా భారీ స్కెచ్ వేస్తున్నారు. ఒక సరికొత్త కథతో ప్రేక్షకులను ఆశ్చర్యంలో ముంచెత్తబోతున్నారు.
ఈ క్రమంలో ఈ సినిమాకి సంబంధించిన టాప్ 10 విశేషాలను మనమూ తెలుసుకుందాం ..!
1. విక్రమ్ 2 హీరోలు
విక్రమ్ 2 (Vikram 2) సినిమాలో లీడ్ రోల్‌లో కమల్ హాసన్ నటించనున్నారు. సూర్య, విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల‌్‌తో పాటు రామ్ చరణ్, కార్తీలు కూడా విక్రమ్ 2 ప్రాజెక్ట్ కోసం లోకేష్ కనగరాజ్‌ను సంప్రదించారనే టాక్ వినిపిస్తోంది.
2. స్పెషల్ ఎట్రాక్షన్ కమల్
విక్రమ్‌కు మించి 'విక్రమ్ 2'లో కమల్ హాసన్ (Kamal Haasan) రోల్ ఉండేలా డైరెక్టర్ లోకేష్ ప్లాన్ చేశారట. విక్రమ్ సినిమాలో కమల్‌కు స్వయంగా మేకప్ వేసిన లోకేష్.. 'విక్రమ్ 2'లో తన హీరోను మరో స్పెషల్ లుక్‌లో కనిపించేలా చేయనున్నారట.
3. సూర్య విలనా?
'విక్రమ్' చిత్రంలో రోలెక్స్ పాత్రలో కనిపించి కమల్ హాసన్‌కు (Kamal Haasan) సపోర్ట్‌గా నిలిచారు సూర్య. సినిమా రేంజ్‌ను పెంచేందుకు తొలుత సూర్యను గెస్ట్ రోల్ కోసం లోకేష్ సంప్రదించారు. అయితే సూర్య సీన్స్ సినిమాకు ప్లస్ అయ్యాయి. ఇక విక్రమ్ 2లో సూర్య విలన్‌గా కనిపిస్తారట. 'విక్రమ్' సినిమాలో రెమ్యూనరేషన్ తీసుకోకుండా సూర్య నటించారు.
4. రామ్ చరణ్ పాత్ర ఏంటి?
కమల్ హాసన్ (Kamal Haasan) కుమారుడిగా రామ్ చరణ్ విక్రమ్ 2 లో నటిస్తున్నారా?. అందుకనే విక్రమ్ టీమ్‌కు చిరంజీవి పార్టీ కూడా ఇచ్చారనే టాక్ వినిపిస్తుంది. అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే, విక్రమ్ ట్రైలర్‌ను రామ్ రిలీజ్ చేశారు. అందుకే, విక్రమ్ 2 లో రామ్ చరణ్ నటిస్తున్నారనే హింట్ ఇచ్చారా? అనేది కూడా తెలియాల్సి ఉంది. పోలీస్ పాత్రలో రామ్ చరణ్ నటిస్తారని కూడా కొన్ని వార్తలొచ్చాయి.
5. విక్రమ్ విలన్ సంగతి
విక్రమ్‌లో విజయ్ సేతుపతి విలన్‌గా నటించి మెప్పించారు. విక్రమ్ 2 లో కచ్చితంగా విజయ్ సేతుపతి పాత్ర ఉంటుందా?. లేక మరో స్టార్ హీరోను రీ ప్లేస్ చేస్తారా అనేది చూడాలి. ఎందుకంటే, సూర్య మాత్రమే విలన్ రోల్ చేస్తారనే న్యూస్ బయటకు వచ్చింది. ఇక కమల్ హాసన్‌తో (Kamal Haasan) తలపడే విలన్ ఎవరనే ఆసక్తి ప్రేక్షకుల్లో మరింత పెరిగింది. ఫహాద్ ఫాజిల్ పాత్ర కూడా ద్వితీయ భాగానికి కీలకమేనట.
6. కార్తీని విక్రమ్ 2 లో చూడచ్చా!
కార్తీతో లోకేష్ కనగరాజ్ 'ఖైదీ' సినిమా తెరకెక్కించారు. ఖైదీ చిత్రానికి సీక్వెల్‌గా ఖైదీ 2 కూడా సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే ఈ సినిమాకు టైం పడుతుంది. విక్రమ్ 2 (Vikram 2) తో పాటు, ఖైదీ 2 లో కూడా విలన్‌గా సూర్య నటిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. సూర్య కోసం కమల్ హాసన్, కార్తీలు కలుస్తారా.. వీరిద్దరి సీన్స్ లోకేష్ సీక్వెల్స్‌లో యాడ్ చేస్తారని కూడా టాక్.
7. ఇంత మంది హీరోలా
దర్శకుడు లోకేష్ కనగరాజ్ మల్టీస్టారర్ సినిమాలు చేస్తూ కొత్త ట్రెండ్ సృష్టిస్తున్నాడు. ఒకే సినిమాలో నలుగురు లేదా అయిదుగురు హీరోలకు చోటు కల్పిస్తూ, సినిమాను కొత్త ప్రయోగాలతో నింపడానికే ఆయన సిద్ధపడుతున్నాడు.
8. అభిమానుల మధ్య చిగురిస్తున్న స్నేహం
అభిమానులు తమ హీరోల కోసం గొడవ పడకుండా.. ఒక హీరో అభిమానులు, మరో హీరో సినిమాను ప్రమోట్ చేసేలా చేస్తున్నాడు లోకేష్ కనగరాజ్. నలుగురు హీరోలతో 'విక్రమ్' సినిమా తీసి తమిళనాడులో భారీ సక్సెస్ సాధించాడు.
9. విక్రమ్ 2 కమల్ సొంత బ్యానర్‌లోనేనా!
కమల్ హాసన్ (Kamal Haasan) తన సొంత బ్యానర్ రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్‌పై విక్రమ్ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పుడు అదే బ్యానర్ పై 'విక్రమ్ 2' తెరకెక్కుతుందా? అనేది కూడా ఓ ప్రశ్నే.
10. ఈ సారి హీరోయిన్ కూడానా
విక్రమ్ 2 (Vikram 2) కోసం డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ స్టార్ హీరోయిన్లను బరిలో దించనున్నారట. మరి ఎంతమంది హీరోయిన్లు విక్రమ్ 2 లో కనిపిస్తారో చూడాలి.
Follow Us