సినీ ఇండస్ట్రీలో నటులకు అభినయంతోపాటు అందం కూడా చాలా ముఖ్యంగా మారింది. ఎంత బాగా నటించినప్పటికీ కాస్త అందం కూడా ఉంటే ఆ ఫేస్ జనాల్లోకి ఇంకా బాగా వెళ్తుంది. రజినీకాంత్ (Rajinikanth) లాంటి ఒకరిద్దరు దీనికి మినహాయింపు అనుకోండి. సిక్స్ ప్యాక్ బాడీ, సిక్స్ ఫీట్ హైట్ లేకున్నా ఆయన సూపర్‌స్టార్ అయ్యారు. మిగిలిన హీరోలకు మాత్రం ఇది అంతగా వర్తించదు. హీరో, హీరోయిన్లు అంటే మంచి లుక్స్‌తోపాటు ఫిట్‌గా కూడా ఉండాలనేది ఇప్పుడు సర్వసాధారణం అయిపోయింది.
హీరోయిన్లు కూడా స్లిమ్‌గా, నాజూగ్గా తయారవ్వడానికే ఇష్టపడుతుంటారు. అందుకు తగ్గట్లే జిమ్, యోగా లాంటివి చేస్తూ బరువు పెరగకుండా శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకునేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే పెళ్లి అయ్యాక కూడా యాక్ట్ చేస్తున్న హీరోయిన్లలో కొందరు బరువు పెరుగుతూ విమర్శల పాలవుతున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ గురించి సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. గతేడాది వివాహం చేసుకున్న ఈ బ్యూటీ నటనకు కాస్త విరామం ఇచ్చారు. అయితే మూడ్నాలుగు నెలలకే ఆమె యాక్ట్ చేయడానికి రెడీ అయిపోయారు.
బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కాజల్ (Kajal Aggarwal) మరింత అందంగా కనిపిస్తున్నారని ఆమె ఫొటోలను చూస్తున్న అభిమానులు అంటున్నారు. కాస్త బరువు పెరిగినప్పటికీ లుక్స్ మాత్రం అదుర్స్ అని చెబుతున్నారు. అయితే కొందరు నెటిజన్స్ మాత్రం కాజల్ బొద్దుగా తయారయ్యారని కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం ‘ఇండియన్–2’ సినిమాలో పాత్ర కోసమే ఆమె బరువు పెరిగారని అంటున్నారు. మరి, ఈ విషయంపై కాజల్ స్పందిస్తారేమో చూడాలి. కాగా, విశ్వనటుడు కమల్ హాసన్ (Kamal Haasan)కు జంటగా ‘ఇండియన్–2’ (Indian 2) చిత్రంలో కాజల్ యాక్ట్ చేస్తున్నారు. ఇందులో తన క్యారెక్టర్ డిమాండ్ చేయడంతో ఆమె గుర్రపు స్వారీ, కత్తి సాము లాంటి యుద్ధ కళల్లోనూ శిక్షణ తీసుకుంటున్నారు. ఈ సినిమాతో స్ట్రాంగ్‌గా కమ్‌బ్యాక్ ఇవ్వాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.
Read more: Dil Raju: ఎవరినీ తక్కువ చేసి మాట్లాడను.. తమిళ హీరోల వివాదంపై స్పందించిన నిర్మాత దిల్ రాజు
Follow Us