టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ (Nikhil Siddharth) నటిస్తున్న తాజా చిత్రం ‘కార్తికేయ 2’. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. నిఖిల్, దర్శకుడు చందు మొండేటి (Chandoo Mondeti) కాంబినేషన్ లో వచ్చిన 'కార్తికేయ' సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలోనే ఆ సినిమా సీక్వెల్ తో ప్రేక్షకుల ను ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతున్నారు మేకర్స్.
‘కార్తికేయ 2’ (Karthikeya 2) చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై టి.జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్, టాలీవుడ్ ఫేమస్ కమెడియన్ కమ్ హీరో శ్రీనివాస రెడ్డి, వైవా హర్ష కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో.. ఈ చిత్రం ఆగస్ట్ 13న గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో శనివారం ఈ మూవీ ట్రైలర్‌ను టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ ట్విట్టర్ వేదికగా విడుదల చేశారు.
‘కార్తికేయ 2’ సినిమాలో శ్రీకృష్ణునికి సంబంధించిన చరిత్ర, ద్వారకా నగరం మీద అన్వేషణ చేసే వైద్యుడిగా నిఖిల్ కనిపించనున్నారు. 'ఐదు సహస్రాల ముందే పలికిన ప్రమాదం.. ప్రమాదం లిఖితం, పరిష్కారం లిఖితం' అనే డైలాగ్ తో ట్రైలర్ (Karthikeya 2 Trailer) మొదలైంది. 'నా వరకు రానంత వరకే సమస్య నా వరకు వచ్చాక అది సమాధానం' అని హీరో చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటుంది. ట్రైలర్ లో విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఓ రేంజ్ లో ఉన్నాయి. ట్రైలర్ ద్వారా కథను రివీల్ చేసే ప్రయత్నం చేశారు. యాక్షన్ సీన్స్ కూడా ఉన్నాయి. ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింతగా పెంచేసింది.
‘ఈ ట్రైలర్ చాలా ఆసక్తికరంగా ఉంది. చూస్తుంటే మరో టాప్ క్లాస్ ఫిల్మ్ రాబోతున్నట్లుగా అనిపిస్తుంది. టీమ్ మొత్తానికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను..’ అని రవితేజ (Ravi Teja) ట్వీట్‌లో పేర్కొన్నారు. నిజానికి జూలైలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ వాయిదాల మీద వాయిదాలు పడుతూ.. ఫైనల్ గా ఆగస్టు 13న డేట్ ఫిక్స్ (Karthikeya 2 Release Date) చేసుకుంది. అయితే.. ప్రతీసారి తమ సినిమానే వాయిదా వేసుకోవడంపై ఆ మధ్య నిఖిల్ కాస్త అసహనానికి లోనయ్యారు. కానీ ఇండస్ట్రీ మంచి కోసం కొన్ని చేయక తప్పదంటూ చాలా పాజిటివ్ గా మాట్లాడారు.
Follow Us