త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్న యంగ్ హీరో నాగశౌర్య (Naga Shaurya).. అమ్మాయి ఎవరంటే?

నాగశౌర్య (Naga Shaurya) త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. అనూష (Anusha) అనే అమ్మాయితో ఆయన ఏడడుగులు వేయనున్నారు.

టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య (Naga Shaurya) తెలుగు ప్రేక్షకులందరికీ సుపరిచితుడే. పక్కింటి కుర్రాడిలా అనిపించే ఈ హీరో.. దాదాపు 12ఏళ్లుగా తెలుగు ఇండస్ట్రీలో ఉన్నాడు. లవర్ బాయ్ గా.. హ్యాండ్సమ్ హీరోగా.. రొమాంటిక్ హీరోగా ఆయన మంచి మార్కులు కొట్టేశాడు. 2011లో వచ్చిన ‘క్రికెట్,గర్ల్స్ అండ్ బీర్’ అనే చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ఈ యంగ్ హీరో ఆ తర్వాత ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వచ్చిన ‘చందమామ కథలు’లో కూడా నటించాడు. 

అయితే ‘ఊహలు గుసగుసలాడే’ చిత్రం ఇతనికి హీరోగా మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత 'దిక్కులు చూడకు రామయ్య' సినిమాతో ఈ హీరో అమ్మాయిల గుండెల్లో తిష్ట వేశాడు. ఇక అప్పడి నుంచి తెలుగు తెరపై దూసుకెళ్తున్నాడు. యూత్ కు కనెక్ట్ అయ్యే సినిమాలు చేస్తూ పలు విజయాలు అందుకున్నాడు. ‘ఓ బేబీ’ (O Baby), ‘ఛలో’ (Chalo) వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించాడు.

ఈ ఏడాది ‘కృష్ణ వ్రింద విహారి’(Krishna Vrinda Vihari) తో ప్రేక్షకులను పలకరించిన శౌర్య చేతిలో ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’, ‘నారీ నారీ నడుమ మురారి’, ‘పోలీసు వారి హెచ్చరిక’, #NS24 (వర్కింగ్ టైటిల్) చిత్రాలు ఉన్నాయి. 

ఇదిలా ఉండగా.. ఈ హ్యాండ్సమ్ హీరో త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. అనూష (Anusha) అనే అమ్మాయితో ఆయన ఏడడుగులు వేయనున్నారు. ఈ నెల 20న ఉదయం 11.25 గంటలకు వీరి వివాహం జరగనుంది. బెంగళూరులోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ ఇందుకు వేదిక కానుంది. కొద్దిమంది అతిథుల సమక్షంలోనే ఈ వేడుక జరగనున్నట్లు సమాచారం. 

అయితే.. 19న మెహందీ ఫంక్షన్ ఉండటంతో.. ఇప్పటికే నాగ శౌర్య ఇంట పెళ్లి సందడి మొదలైంది. కాగా, నాగశౌర్య (Naga Shaurya)  పెళ్లి చేసుకునే అనూష ఎవరు? ప్రేమ పెళ్లా, పెద్దలు కుదిర్చిందా? అంటూ అభిమానులు సోషల్ మీడియా వేదికగా చర్చించుకుంటున్నారు నెటిజన్లు.

Credits: Twitter
You May Also Like These