Ginna Teaser: హార్రర్ కామెడీతో రాబోతున్న మంచు విష్ణు (Manchu Vishnu).. 'జిన్నా' టీజర్ రిలీజ్..!

తాజాగా మేకర్స్ 'జిన్నా' సినిమా నుండి టీజర్  (Ginna Teaser) విడుదల చేశారు. ఈ టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

మంచు విష్ణు (Manchu Vishnu) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం “జిన్నా” (Ginna). ఇప్పటికే ఈ  సినిమా ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో విష్ణు "గాలి నాగేశ్వ‌ర‌రావు" పాత్ర‌లో క‌నిపించ‌నుండగా.. ఆయనకు జోడీగా పాయ‌ల్ రాజ్‌పుత్ న‌టించింది. మరో ప్రధాన పాత్రలో బాలీవుడ్ బ్యూటీ సన్నీ లియోన్ కూడా నటిస్తోంది. టాలీవుడ్‌లోని మెజారిటీ కామెడీ స్టార్స్ అందరూ ఈ సినిమాలో కనువిందు చేయబోతున్నారు. 

ప్ర‌ముఖ ర‌చ‌యిత, నిర్మాత కోన‌వెంక‌ట్ (Kona Venkat) ఈ చిత్రానికి క‌థ‌, స్క్రీన్‌ప్లే అందించ‌డంతో పాటు, క్రియేటివ్ ప్రొడ్యూస‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. AVA ఎంట‌ర్టైన‌మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనూప్ సంగీత దర్శకత్వం వహిస్తుండగా.. ఛోటా కే. నాయుడు సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ్యవహరిస్తున్నారు. ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్‌గా తెర‌కెక్కుతున్న‌ ఈ చిత్రాన్ని ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 5న‌ ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు.

తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ భాషల్లో 'జిన్నా' సినిమా రిలీజ్ కానుంది. ఈ మూవీ ద్వారా సూర్య డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నాడు. తాజాగా మేకర్స్ ఈ సినిమా నుండి టీజర్  (Ginna Teaser) విడుదల చేశారు. ఈ టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. 

'జిన్నా' టీజర్ (Ginna Teaser) లో టెంట్ హౌస్ నిర్వహించే యువకుడి పాత్రలో విష్ణు మంచు నటిస్తున్నట్లు తెలుస్తోంది. 'వీడేందిరా మనల్ని దొబ్బుతున్నాడు..' అంటూ విష్ణు మరోసారి తన కామెడీ యాంగిల్ బయటపెట్టాడు. రఘుబాబు, చమ్మక్ చంద్ర తమ నటనతో నవ్వించారు. 

ఈ సినిమాలో "జిన్నా" అనే పాత్రలో మంచు విష్ణు (Manchu Vishnu) సాలిడ్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను తీసుకొస్తున్నాడు. ఊరి జనానికి బ్యాడ్ టైమ్ తీసుకొచ్చే వ్యక్తిగా జిన్నా పేరు తెచ్చుకుంటాడు. ఈ క్రమంలో అతడికి ఉన్న సమస్యలను ఎలా అధిగమిస్తాడు అనేది ఈ సినిమాలో హిలేరియస్‌గా చూపించబోతున్నారు. హార్రర్ కామెడీతో ప్రేక్షకుల పొట్టచెక్కలు చేసేందుకు జిన్నా రాబోతున్నట్లు ఈ టీజర్ ద్వారా తెలియజేశారు చిత్ర యూనిట్.

Read More: Manchu Vishnu: స‌న్నీ లియోన్ కు ముద్దు పెట్టేసిన మంచు విష్ణు!

Credits: Instagram
You May Also Like These