ఆచార్య (Acharya) సినిమా చూసిన‌ యంగ్ హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. ఏమ‌న్నారంటే!

Published on Apr 30, 2022 06:11 PM IST

టాలీవుడ్ యంగ్‌ హీరో కిరణ్‌ అబ్బవరం (Kiran Abbavaram) ప్ర‌స్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. తొలుత‌ 'ఎస్ఆర్ క‌ల్యాణమండ‌పం' సినిమాతో మంచి క్రేజ్‌ సంపాదించుకున్న ఈ హీరో ఇటీవలే 'సెబాస్టియ‌న్ పీసీ 524' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద అంత‌గా ఆడ‌లేక‌పోయింది. దీంతో తాజాగా స‌మ్మ‌త‌మే అనే మ‌రో సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు మ‌రోసారి రెడీ అయ్యాడు. 

కాగా, ఈ మూవీతో గోపీనాథ్ రెడ్డి దర్శకునిగా పరిచయం కానున్నారు. 'క‌లర్‌ఫొటో' సినిమా ఫేం చాందినీ చౌద‌రి ఈ చిత్రంలో కిరణ్‌ అబ్బవరంకి జోడీగా నటించనుంది. ఇటీవ‌లే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తూ చిత్ర‌ మేకర్స్‌ పోస్టర్‌ రిలీజ్‌ చేశారు. యూజీ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ పై కంక‌ణాల ప్ర‌వీణ నిర్మిస్తున్న ఈ చిత్రం రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. 

ఈ హీరో తాజాగా రిలీజ‌యిన మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) మూవీ ఆచార్య (Acharya) సినిమాను హైద‌రాబాద్ లోని ఓ థియేట‌ర్ లో వీక్షించాడు. సినిమా అయిపోయిన త‌ర్వాత థియేట‌ర్ బ‌య‌టికి రాగానే మీడియా కంట‌బడ్డాడు. కాగా, ప్ర‌స్తుతం ఆ వీడియో వైర‌ల్ గా మారింది. 

ఇదిలా ఉంటే.. ఆచార్య సినిమా తాజాగా కిర‌ణ్ అబ్బ‌వరం సోష‌ల్ మీడియాలో ఓ ఆస‌క్తిక‌ర‌మైన పోస్ట్ పెట్టాడు. ఆ ట్వీట్ లో చిరంజీవి, రాంచ‌ర‌ణ్ స‌ర్.. మీ ఇద్దరినీ ఒకే ఫ్రేమ్ లో చూడాలి అని మా 90లలో పుట్టిన వారి అందరి కోరిక అలాంటిది అది ఇప్పుడు ఆచార్య తో తీరబోతుంది అని పేర్కొన్నాడు. 

అంతేకాకుండా నాకు తెలిసిన వాళ్ల‌లో మీ వ‌య‌సు వారు ప్ర‌స్తుతం కీళ్ల నొప్పుల‌తో బాధ‌ప‌డుతున్నార‌ని.. మీరు మాత్రం ఇప్ప‌టికీ ప్ర‌స్తుత హీరోలుకు త‌గ్గ‌ట్లుగా డ్యాన్సులు వేస్తూ మా త‌రం హీరోల‌కు ఆద‌ర్శంగా నిలుస్తున్నార‌ని పేర్కొన్నాడు. థ్యాంక్యూ మెగాస్టార్ అంటూ చిరంజీవి పై త‌న‌కున్న ప్రేమ, గౌర‌వాన్ని సోష‌ల్ మీడియా ద్వారా వ్య‌క్త ప‌రిచాడు ఈ హీరో.