Kiran Abbavaram: పీవీపీ మాల్‌లో సందడి చేసిన కిరణ్‌ అబ్బవరం.. వీడియో వైరల్

సమ్మతమే సినిమా పోస్టర్

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram), చాందినీ చౌదరి జంటగా గోపీనాథ్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘సమ్మతమే’. జూన్‌ 24వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీంతో ప్రమోషన్స్‌లో స్పీడ్ పెంచింది చిత్ర యూనిట్. అందులో భాగంగా కిరణ్ అబ్బవరం హైదరాబాద్‌లోని పీవీపీ మాల్‌లో సందడి చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో నెట్‌లో వైరల్ అవుతోంది. ఇప్పటికే రిలీజైన సమ్మతమే ట్రైలర్‌‌ యూత్‌ను ఆకట్టుకుంటోంది.

రొమాంటిక్ ప్రేమ కథగా తెరకెక్కిన ‘సమ్మతమే‘ సినిమా ట్రైలర్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. కిరణ్ అబ్బవరం ఫ్రెష్‌ లుక్‌లో కనిపిస్తున్నాడు. అలాగే ఆయన డైలాగ్ డిక్షన్‌, యాక్టింగ్‌ సినిమాపై అంచనాలను భారీగా పెంచుతోంది. మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్ సినిమాకు మరో ప్లస్ అవుతుందనే చెప్పాలి. ‘సమ్మతమే‘ సినిమాలో హీరోహీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ బాగానే వర్క్‌ అవుట్‌ అయినట్టుగా టీజర్‌‌లో కనిపిస్తోంది.

డైలాగ్స్‌ ఆకట్టుకుంటున్నాయి..

ముఖ్యంగా కిరణ్‌  చెప్తున్న డైలాగులు యూత్‌కు బాగా కనెక్ట్‌ అయ్యేలా ఉన్నాయి. ‘గోల్డెన్ చైన్ వేసుకున్నందుకు ఇన్నాళ్లకు వచ్చిందిరా గోల్డెన్ చాన్స్’ ‘గుద్ది పడదొబ్బడం అంటే ఏంటో అనుకున్నాను.. మరీ ఇలానా.. లారీలు అయినా గుద్దితే తిరిగి చూస్తాయేమో.. ఈ అమ్మాయిలు తిరిగి చూసేలా లేరు’  అంటూ కిరణ్ చెప్పిన డైలాగ్స్‌ బాగా పేలాయి.

డైరెక్టర్ గోపీనాథ్ రెడ్డి ఈ సినిమాలో ప్రతి ఫ్రేమ్‌నూ చాలా జాగ్రత్తగా తీర్చిదిద్దినట్టు అనిపిస్తోంది. కిరణ్‌ (Kiran Abbavaram) తండ్రిగా గోపరాజు రమణ నటన కూడా బాగుంది. ఈ సినిమా టీజర్‌‌ను తెలంగాణ మంత్రి కేటీఆర్‌‌ రిలీజ్ చేశారు.

Read More : Kajal Aggarwal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ నటించిన టాప్ టెన్ సినిమాలు (బర్త్‌డే స్పెషల్)

You May Also Like These