ఉత్కంఠగా ‘టాప్ గేర్’ ట్రైలర్ (Top Gear Trailer).. ఆది సాయికుమార్ (Aadi Saikumar) హిట్ కొట్టేనా..?

‘టాప్ గేర్’ (Top Gear Trailer) ట్రైలర్ అయితే ఆకట్టుకుంటోంది. ఓ ట్యాక్సీ డ్రైవర్‌గా పనిచేసే హీరోకు అనుకోకుండా ఎదురైన ప్రమాదం నుంచి అతడు ఎలా బయటపడ్డాడు అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమాను థ్రిల్లింగ్ అంశాలతో తెరకెక్కించినట్లుగా ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.

టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయికుమార్ (Aadi Saikumar) హిట్లు, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తుంటాడు. ఆయన నటించిన తాజా చిత్రం ‘టాప్ గేర్’ (Top Gear). కె.శశికాంత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఆది సరసన హీరోయిన్ గా రియా సుమన్ (Riya Suman) నటిస్తోంది. ఆదిత్య మూవీస్ & ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ సినిమాను కె.వి శ్రీధర్ రెడ్డి నిర్మిస్తుండగా.. గిరిధర్ మామిడిపల్లి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.

‘టాప్ గేర్’ (Top Gear) సినిమా నుంచి ఇదివరకే పాటలు, టీజర్ చిత్రంపై ఆసక్తిని రేకెత్తిసున్నాయి. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబర్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో పలు అప్డేట్ లు విడుదల చేస్తున్నారు చిత్ర యూనిట్. ఇందులో భాగంగానే తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ చేతుల మీదుగా విడుదల చేయించారు. 

ఇక, ‘టాప్ గేర్’ (Top Gear Trailer) ట్రైలర్ అయితే ఆకట్టుకుంటోంది. ఓ ట్యాక్సీ డ్రైవర్‌గా పనిచేసే హీరోకు అనుకోకుండా ఎదురైన ప్రమాదం నుంచి అతడు ఎలా బయటపడ్డాడు అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమాను థ్రిల్లింగ్ అంశాలతో తెరకెక్కించినట్లుగా ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ‘టాప్ గేర్’ కథ మొత్తం డేవిడ్ అనే వ్యక్తి చుట్టూ తిరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇంతకీ అతను ఎవరు అనేది మాత్రం ఎవరికీ తెలీదు. ఓ గ్యాంగ్ డేవిడ్ కోసం వెతుకుతూ ఉంటుంది. 

మరోవైపు పోలీస్ డిపార్డ్మెంట్ లో ఒక్కక్కరూ చనిపోతున్నట్టు చూపిస్తారు. అసలు ఆ డేవిడ్ ఎవరు, అతని కోసం అందరూ ఎందుకు వెతుకుతున్నారు. హైదరాబాద్ లో జరిగిన పలు హత్యలకు, డేవిడ్ కూ సంబంధం ఏంటి?వీళ్లంతా క్యాబ్ డ్రైవర్ అయిన ఆది ఎందుకు వెంటాడుతున్నారు. హీరో ఆది (Aadi Saikumar) చివరికి ఆ సమస్య నుంచి ఎలా తప్పించుకున్నారు వంటి ఉత్కంఠ రేపే ప్రశ్నలతో ట్రైలర్ ముగుస్తుంది.

‘టాప్ గేర్’ చిత్రంలో బ్రహ్మాజీ, సత్యం రాజేష్, మైమ్ గోపి, నర్రా, శత్రు, బెనర్జీ, గిరిధర్, రేడియో మిర్చి హేమంత్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘టాప్ గేర్’ సినిమాకు హర్ష వర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో మరోసారి ఆది తనదైన యాక్టింగ్‌తో ఆకట్టుకోవడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. చూడాలి మరి ఆది (Aadi Saikumar).. ఈ సినిమాతో అయినా సక్సెస్ ను అందుకుంటాడో లేదో అనేది.

Read More: ఆది సాయి కుమార్ (Adi Sai Kumar) లేటెస్ట్ మూవీ “టాప్ గేర్” (Top Gear).. ఆసక్తికరంగా టీజర్!

Credits: Pinkvilla
You May Also Like These