ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి (MM Keeravani) ఇంట్లో విషాదం నెలకొంది. కీరవాణి తల్లి భానుమతి బుధవారం కన్నుమూశారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెను కుటుంబ సభ్యులు మూడ్రోజుల కింద కిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. అయితే చికిత్స పొందుతుండగా ఆమె ఆరోగ్యం క్షీణించడంతో ఇవాళ తుదిశ్వాస విడిచారు.
భానుమతి భౌతికకాయాన్ని మరికొద్ది సేపట్లో ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) నివాసానికి తీసుకెళ్లనున్నారని తెలుస్తోంది. కీరవాణి తల్లి మరణవార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు, సన్నిహితులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. చిత్ర ప్రముఖులతోపాటు రాజకీయ నేతలు కూడా కీరవాణి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.
కీరవాణి రాజమౌళికి కజిన్ అవుతారు. జక్కన్న తండ్రి విజయేంద్ర ప్రసాద్, కీరవాణి తండ్రి శివశక్తి దత్తలు సొంత అన్నదమ్ములు. శివశక్తి దత్త కూడా మూవీ ఇండస్ట్రీకి చెందిన వారే. స్క్రీన్ రైటర్‌గా, లిరిసిస్ట్‌గా ఆయన ఎన్నో సినిమాలకు పని చేశారు. ఇకపోతే, పెద్దమ్మ భానుమతి అంటే రాజమౌళికి ఎంతో ఇష్టమట. ఆమె కూడా దర్శకధీరుడ్ని ఎంతో ఆప్యాయతతో చూసేవారని తెలుస్తోంది.
Read more: Avatar: The Way of Water: జేమ్స్ కామెరాన్‌కు 'అవతార్ 2' చిత్రం ఎందుకంత ప్రత్యేకమైందో తెలుసా!
Follow Us