యువ నటులు శివ బాలాజీ, ధర్మ, బ్రిగిడ సాగ (పవి టీచర్) ప్రధాన తారాగణంగా రూపొందుతున్న చిత్రం ‘సింధూరం’ (Sindhooram). ఈ మూవీ షూటింగ్ ఇటీవలే పూర్తి చేసుకుంది. ఈ సినిమాలోని తొలి పాట తాజాగా విడుదలైంది. ‘ఆనందమో ఆవేశమో’ అనే ఈ సాంగ్‌ను సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి రిలీజ్ చేశారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైన ఈ పాటకు నెటిజన్స్ నుంచి మంచి ఆదరణ దక్కుతోంది.
‘ఆనందమో ఆవేశమో’ (Anandamo Avesamo Song) పాట ఎంతో ఆహ్లాదకరంగా సాగుతూ అందర్నీ ఆకట్టుకుంటోంది. ఈ సాంగ్‌ను అభయ్ జోద్పూర్కర్ ఆలపించారు. ‘ఆర్య’ చిత్రంలోని ‘ఉప్పెనంత ఈ ప్రేమకు’ పాట రాసిన బాలాజీనే ఈ సాంగ్‌కు సాహిత్యం అందించడం విశేషం. హరి గౌర ఈ పాటను కంపోజ్ చేశారు. ‘ఆనందమో ఆవేశమో’ సాంగ్‌లో ధర్మ, బ్రిగిడ సాగ బాగా నటించారని, సాంగ్ మెలోడియస్‌గా బాగుందని కామెంట్స్ వస్తున్నాయి. హీరో, హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యిందని ప్రశంసలు వస్తున్నాయి. ప్రముఖ కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి కూడా ఈ పాట గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చెయ్యడం విశేషం.
మంచి బజ్ తెచ్చుకుంటున్న ‘సింధూరం’ చిత్రాన్ని మారేడుమిల్లి ఫారెస్టులో సింగిల్ షెడ్యూల్‌లోనే షూటింగ్ పూర్తి చేసుకుంది. చిత్ర యూనిట్ ఎంతో కష్టపడి తక్కువ సమయంలో చిత్రీకరణను ఫినిష్ చేశారు. ఈ మూవీలోని విజువల్స్, మ్యూజిక్, సాంగ్స్ సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. ఇప్పటికే టైటిల్‌తో ఒకప్పటి కృష్ణవంశీ క్లాసిక్ మూవీ ‘సింధూరం’ను గుర్తు చేస్తున్న ఈ చిత్రం.. రానున్న రోజుల్లో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.
ఇకపోతే, శ్యామ్ తుమ్మలపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సింధూరం’ సినిమాను శ్రీ లక్ష్మీ నరసింహ మూవీ మేకర్స్ బ్యానర్ మీద ప్రవీణ్ రెడ్డి జంగా నిర్మిస్తున్నారు. చైతన్య కందుల, సుబ్బారెడి ఎం సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. కిషోర్ శ్రీ కృష్ణ కథను అందిస్తుండగా.. కేశవ్ సినిమాటోగ్రఫర్‌గా ఉన్నారు. ఈ సినిమాకు జస్విన్ ప్రభు ఎడిటర్‌గా పని చేస్తున్నారు. రామ బాలాజీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.
Read more: Chiranjeevi: చిరంజీవికి ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ 2022 అవార్డు
Follow Us