న్యూయార్క్ ఫిలిం క్రిటిక్స్ సర్కిల్ బెస్ట్ డైరెక్టర్ గా రాజమౌళికి (SS Rajamouli) మరో ప్రతిష్టాత్మక అవార్డు..!

న్యూయార్క్ ఫిలిం క్రిటిక్స్ సర్కిల్ (NYFCC) RRR సినిమాకు గాను బెస్ట్ డైరెక్టర్ గా రాజమౌళిని ఎంపిక చేసింది.

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా మారుమోగుతున్న టాలీవుడ్ సినిమా “ఆర్ఆర్ఆర్” (RRR). ఈ సినిమాతో దిగ్గజ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి పేరు సినిమా ప్రపంచంలో మారుమోగిపోతోంది. తెలుగు సినిమా స్థాయిని వేరే లెవెల్లో ప్రెజెంట్ చేసిన దర్శకుడు మన టాలీవుడ్ దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి. ‘బాహుబ‌లి’తో టాలీవుడ్ స్టాయిని పెంచిన రాజ‌మౌళి.. ‘ఆర్ఆర్ఆర్‌’తో ఏకంగా ఇండియ‌న్ సినిమా స్థాయిని పెంచాడు. 

టాలీవుడ్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) లు హీరోలుగా దర్శక దిగ్గజం జక్కన్న తెరకెక్కించిన ఈ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం ఇప్పుటికీ ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయాన్ని నమోదు చేస్తూ భారీ ఖ్యాతిని గడిస్తోంది. ఈ సినిమాతో రాజమౌళి ఇప్పటికే ఎన్నో అవార్డులను సాధించాడు. కాగా తాజాగా ఆయన మరో ప్రతిష్టాత్మక అవార్డు గెలుచుకున్నాడు. 

న్యూయార్క్ ఫిలిం క్రిటిక్స్ సర్కిల్ (NYFCC) RRR సినిమాకు గాను బెస్ట్ డైరెక్టర్ గా రాజమౌళిని (SS Rajamouli) ఎంపిక చేసింది. ప్రముఖ హాలీవుడ్ ఫిలిం క్రిటిక్స్ సభ్యులుగా ఉన్న NYFCC 1935లో ఏర్పడింది. ఈ అవార్డును హాలీవుడ్ కి చెందిన వాళ్లు ఎంతో ప్రతిష్టాత్మకంగా పరిగణిస్తారు. రాజమౌళికి ఈ అవార్డు రాకతో ఆస్కార్ కి “RRR” మరింత దగ్గరైనట్లేనని సినీ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. కాగా భారత్ నుంచి ఈ NYFCC అవార్డు పొందిన ఏకైక వ్యక్తి జక్కన్నే కావడం విశేషం.

ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ ఎంట‌ర్టైన‌ర్‌గా తెర‌కెక్కిన “ఆర్ఆర్ఆర్” (RRR) చిత్రంలో తార‌క్ కొమురం భీమ్ పాత్రలో న‌టించగా, రామ్‌ చ‌ర‌ణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర‌లో న‌టించాడు. బాలీవుడ్ స్టార్ అజ‌య్ దేవ‌గ‌ణ్ కీల‌క‌పాత్ర‌లో న‌టించాడు. డీవీవీ దాన‌య్య అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించిన‌ ఈ చిత్రంలో అలియాభ‌ట్, ఒలీవియా మోరీస్‌లు కథానాయిక‌లుగా న‌టించారు.

Credits: Pinkvilla
You May Also Like These