Venkatesh: విక్ర‌మ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో క‌మ‌ల్ హాస‌న్ ను ఆకాశానికెత్తేసిన విక్ట‌రీ వెంక‌టేష్!

Published on Jun 02, 2022 03:20 PM IST

Kamal Haasan: లోక‌నాయ‌కుడు కమల్ హాసన్, మ‌క్క‌ల్ సెల్వ‌న్ విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ వంటి హేమాహేమీ న‌టుల‌తో స్టార్ డైరెక్ట‌ర్ లోకేష్ కనగ‌రాజ్ తెరకెక్కించిన చిత్రం విక్రమ్(Vikram Movie). ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రం అన్ని భాషల్లో జూన్ 3న రాబోతోంది. ఇక సినిమా విడుదల దగ్గర పడుతుండటంతో ప్రమోషన్లు పెంచేశారు. హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో ఇటీవ‌లే ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ (Pre Release Event) నిర్వహించారు దర్శకనిర్మాతలు. 

ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమానికి టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ (Hero Venkatesh) ముఖ్య అతిథిగా విచ్చేశారు. ప్రముఖ డైరెక్టర్ హరీష్ శంకర్ కూడా ఈ వేడుకలో పాలుపంచుకున్నారు. ఇక వీరిద్దరూ ఈ వేడుకలో మాట్లాడుతూ కమల్ హాసన్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేసి కమల్ హాసన్ ను ఆకాశానికి ఎత్తేశారు. వెంకటేష్ కమల్ హాసన్ తో ఒక పూర్తి స్థాయి సినిమా చేయాలని ఉంది అని తన మనసులోని మాటను బయట పెట్టారు. 

ఇంకా ఆయ‌న మాట్లాడుతూ.. ‘విక్రమ్ (Vikram Movie) ఫంక్షన్‌కు రమ్మన్నారు.. రాకుండా ఎవరైనా ఉంటారా? ఉంటారా? అంతే కదమ్మా.. కమల్ సర్ నటనకు అరవై ఏళ్లు.. పదహారేళ్ల వయసు తమిళ వర్షన్ సినిమాను కెరీర్ ప్రారంభంలో చేశారు.. నేను అది చూసిన తరువాత క్లీన్ బోల్డ్ అయ్యాను.. ఆయన వయసు, మనసు ఇంకా పదహారేళ్లలోనే ఉండిపోయింది. మరో చరిత్ర అనేది ఓ జీపీఎస్. దశావతారం లాంటి సినిమాలను ఏ ఒక్క నటుడు చేయలేదు. అంత గట్స్ ఎవ్వరికీ లేదు. అపూర్వ సహోదరులు ఆయన. ఏక్ దూజే కే లియోతో ఫస్ట్ పాన్ ఇండియన్ స్టార్. ఈ ప్రపంచం మొత్తానికి ఆయన గ్లోబల్ స్టార్. అంతే అమ్మా అంతే.. కమల్ సార్ యూనిక్ క్వాలిటీ.. అంటూ కొనియాడారు. 

అనంత‌రం కమల్ హాసన్ మాట్లాడుతూ యంగ్ హీరో నితిన్ కు (Hero Nitin) కొన్ని సలహాలు కూడా ఇచ్చారు. "నన్ను చూసి మీరేమీ నేర్చుకో కండి. మీరు ఏదైనా నేర్చుకోవాలి అనుకుంటే వెంకీని చూడండి. మీరు తప్పకుండా సూపర్స్టార్ అవుతారు" అని సలహా ఇచ్చారు కమలహాసన్. "వెంకటేష్ లాగా నేను కూడా గోల్డెన్ స్పూన్ తో పుట్టి ఉంటే పాడైపోయే వాడిని. వెంకీ లా కష్టపడి స్టార్ట్ అయ్యే వాడిని కాదు. అందుకే నితిన్ ఈ విషయంలో వెంకీ ని ఆదర్శంగా తీసుకోవాలి" అని అన్నారు.

Read more: Kamal Hassan: 'విక్ర‌మ్' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న క‌మ‌ల్ హాస‌న్ విక్ట‌రీ వెంక‌టేష్, నితిన్!