హైదరాబాద్‌లో సూపర్‌‌స్టార్ కృష్ణ (Superstar Krishna) మెమోరియల్! నిర్ణయం తీసుకున్న మహేష్‌బాబు (MaheshBabu)?

మహేష్‌బాబు (MaheshBabu) తండ్రి సూపర్‌‌స్టార్ కృష్ణ అంత్యక్రియలు మహాప్రస్థానంలో నిర్వహించడంపై పలువురు విమర్శలు చేస్తున్నారు

మహేష్‌బాబు (MaheshBabu) తండ్రి, సూపర్‌‌స్టార్ కృష్ణ (Superstar Krishna) అనారోగ్యంతో మంగళవారం మరణించారు. బుధవారం ఆయన అంత్యక్రియలు జరిగాయి. కృష్ణ చిన్న కొడుకుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మహేష్‌బాబు.. టాలీవుడ్‌లో స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. 47 ఏళ్ల మహేష్‌బాబు జీవితంలో 2022 ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అంతగా ఎదురుదెబ్బలు తగిలాయి ఆయనకు. జనవరిలో మహేష్‌బాబు అన్నయ్య రమేష్‌బాబు, రెండు నెలల క్రితం తల్లి ఇందిరా దేవి, రెండు రోజుల క్రితం తండ్రి కృష్ణ మరణించారు. ఒకే ఏడాదిలో ముగ్గురు కుటుంబసభ్యులను కోల్పోయారు మహేష్‌బాబు.

సోమవారం అర్థరాత్రి హార్ట్ ఎటాక్ రావడంతో హైదరాబాద్‌లోని కాంటినెంటల్ హాస్పిటల్‌లో కృష్ణను అడ్మిట్‌ చేశారు కుటుంబ సభ్యులు. ట్రీట్‌మెంట్ తీసుకుంటూ మంగళవారం తెల్లవారుజామున కృష్ణ తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్‌లోని మహా ప్రస్థానంలో ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు ముగిసాయి.  మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించడంపై పలు విమర్శలు వస్తున్నాయి. ఈ విషయంలో మహేష్‌బాబుపై పలువురు నెగెటివ్ కామెంట్లు చేస్తున్నారు. దానికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం!

మహాప్రస్థానంలో అంత్యక్రియలపై విమర్శలు...

మహాప్రస్థానంలో కృష్ణ గారి అంత్యక్రియలు చేయడం ఏంటి? ఆయన పెద్ద స్టార్. ఎన్టీఆర్ చనిపోయినప్పుడు అంత్యక్రియలకు రాష్ట్ర ప్రభుత్వం స్థలం ఇచ్చింది. ఏఎన్నార్ అంత్యక్రియలు అన్నపూర్ణ స్టూడియోస్‌లో, శోభన్ బాబు అంత్యక్రియలు చెన్నైలోని ఆయన ఫామ్ హౌస్ లో, కృష్ణంరాజు అంత్యక్రియలు ఆయన ఫామ్‌హౌస్‌లో జరిగాయి. అలాంటప్పుడు కృష్ణ వంటి గొప్ప హీరో అంత్యక్రియలు మహాప్రస్థానంలో నిర్వహించడం ఏంటి? అంటూ మహేష్‌పై కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు.

దీంతో కృష్ణ (Superstar Krishna) పేరుతో ఒక మెమోరియల్‌ను ఏర్పాటు చేయాలని మహేష్‌బాబు (MaheshBabu) నిర్ణయించినట్టు తెలిసింది. అతి త్వరలోనే హైదరాబాద్‌లో ఈ మెమోరియల్‌ ఏర్పాటుకు శ్రీకారం చుట్టనున్నట్టు సమాచారం. త్వరలో వీటికి సంబంధించిన వివరాలను కుటుంబ సభ్యులు వెల్లడించనున్నట్టు తెలుస్తోంది.

Read More : సూపర్‌‌స్టార్ కృష్ణ (Ghattamaneni Krishna) వ్యక్తిగత జీవితం గురించిన 10 ఆసక్తికర విశేషాలు

You May Also Like These