వ‌రుస సినిమాల‌తో సంద‌డి చేయ‌బోతున్న (Victory Venkatesh) విక్ట‌రీ వెంక‌టేష్!

Published on May 13, 2022 10:11 PM IST

టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్ (Victory Venkatesh) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆ మ‌ధ్య స్వ‌యానా మేన‌ల్లుడైన నాగ‌చైత‌న్య తో క‌లిసి వెంక‌టేష్ వెంకి మామ అనే సినిమా చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే, ఆ సినిమా డిజాస్టర్ అయింది. ఆ త‌ర్వాత వ‌రుస‌గా "నారప్ప", "దృశ్యం 2" సినిమాలతో వెంకటేష్ మంచి విజయాలను సాధించారు. ఇక ఆయ‌న‌ ప్రస్తుతం "ఎఫ్ 3" సినిమా షూటింగ్ పూర్తి కావ‌డంతో ప్ర‌మోష‌న్ల‌తో బిజీగా ఉన్నారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా హీరోగా నటిస్తున్న ఈ సినిమా ఒక కామెడీ ఎంటర్ టైనర్. 

'ఎఫ్2' సినిమా తెర‌కెక్కించిన‌ అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మెహరీన్, తమన్నా ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే ఈ సినిమా అనంత‌రం వెంకటేష్ మరొక ఆసక్తికరమైన ప్రాజెక్టుకు సైన్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ హీరో యంగ్ డైరెక్ట‌ర్ సంపత్ నంది దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. మాస్ ఎంటర్ టైనర్ గా తెర‌కెక్కునున్న‌ ఈ సినిమా త్వరలోనే పట్టాలెక్కబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. 

అయితే, వెంకటేష్ (Victory Venkatesh) ప్రస్తుతం జాతిర‌త్నాలు డైరెక్ట‌ర్ అనుదీప్ కె.వి డైరెక్షన్ లో ఒక కామెడీ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తరువాతే సంపత్ నంది దర్శకత్వంలో వెంకటేష్ సినిమా షూటింగ్ మొదలు కాబోతున్నట్లు సమాచారం. అయితే మరో వైపు వెంకీ ఓటీటీలోకీ అడుగుపెట్ట‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. ద‌గ్గుబాటి రానా తో కలిసి ఒక వెబ్ సిరీస్ లో నటించనున్నట్లు తెలుస్తోంది. "రానా నాయుడు" అనే టైటిల్ తో ఈ వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో విడుదల కాబోతోంది.