Richa Chadha Controversy: రిచా చద్దాను తప్పుబట్టిన అక్షయ్ కుమార్.. ఖిలాడీ హీరోకు ప్రకాశ్ రాజ్ కౌంటర్ 

‘మీకంటే ఎక్కువగా రిచా చద్దానే మన దేశానికి సంబంధించినది’ అంటూ అక్షయ్ కుమార్ (Akshay Kumar)పై ప్రకాశ్ రాజ్ (Prakash Raj) కౌంటర్ వేశారు 

విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ (Prakash Raj) అందరికంటే ప్రత్యేకంగా ఆలోచిస్తారు. ప్రశ్నించేందుకు ఎప్పుడూ ఆయన ముందుంటారు. సినిమాలను మినహాయిస్తే రాజకీయాల్లోనూ ఆయన చాలా చురుగ్గా ఉంటారు. కరెంట్ పొలిటికల్ ఇష్యూస్ మీద ఎప్పటికప్పుడు ప్రకాష్ స్పందిస్తూ ఉంటారు. బెంగళూరులో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయినప్పటికీ, తన ప్రశ్నించే పోరాటాన్ని మాత్రం ఆయన ఆపడం లేదు. 

తాజాగా బాలీవుడ్ హీరోయిన్ రిచా చద్దా (Richa Chadha)కు ప్రకాష్ రాజ్ మద్దతుగా నిలిచారు. ఓ నెటిజన్ ట్వీట్‌కు ఇండియన్ ఆర్మీని ఉద్దేశిస్తూ ఆమె బదులివ్వడం వివాదానికి దారి తీసింది. ఆమెను విమర్శిస్తూ నెటిజన్స్‌తోపాటు ప్రముఖ నటులు అక్షయ్ కుమార్ (Akshay Kumar), నిఖిల్ సిద్ధార్థ్, మంచు విష్ణు లాంటి వాళ్లు తప్పుబట్టారు. అయితే ప్రకాశ్ రాజ్ ఆమెకు సపోర్ట్‌గా నిలిచారు. అంతేగాక రిచా చద్దాను అక్షయ్ కుమార్ తప్పుబట్టడాన్ని ప్రకాశ్ రాజ్ ఖండించారు. 

‘మీ నుంచి ఇలాంటి స్పందన ఊహించలేదు. మీకంటే ఎక్కువగా ఆమెనే మన దేశానికి సంబంధించినది’ అని అక్షయ్‌ను ఉద్దేశించి ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేశారు. రిచా చద్దా ఉద్దేశ్యం ఏంటో తనకు తెలుసని అన్నారు. దీంతో ఆయనపై నెటిజన్స్ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. మరి, ఈ వివాదానికి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో చూడాలి. ఇకపోతే, ప్రకాశ్ రాజ్ ప్రస్తుతం ‘రంగమార్తాండ’, ‘వరిసు’ చిత్రాల్లో నటిస్తున్నారు. ‘రంగమార్తాండ’లో ఆయన ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. ఈ మూవీని వైవిధ్యమైన చిత్రాలు తెరకెక్కించే కృష్ణవంశీ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో బ్రహ్మానందం, రమ్యకృష్ణ కీలక రోల్స్‌లో యాక్ట్ చేస్తున్నారు. వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఈ చిత్రం రిలీజ్ కానుందని తెలుస్తోంది. 

Read more: The Family Man 3: ‘ది ఫ్యామిలీ మ్యాన్’ మూడో సీజన్‌కు సన్నాహాలు.. సమంత (Samantha Ruth Prabhu)కు చాన్స్ ఇస్తారా?

You May Also Like These