'బింబిసార'(Bimbisara) , 'సీతా రామం' హిట్‌ అయ్యాయని ఆనందపడిపోకూడదు.. తమ్మారెడ్డి భరద్వాజ ఆసక్తికర వ్యాఖ్యలు!

'బింబిసార'(Bimbisara) , 'సీతా రామం' హిట్‌ అయ్యాయని ఆనందపడిపోకూడదు. భవిష్యత్తులో తెరకెక్కించే ప్రతి చిత్రాన్ని మంచి కంటెంట్‌తో రూపొందించాలి.

టాలీవుడ్ లో ఇటీవల నందమూరి కల్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) నటించిన 'బింబిసార', దుల్కర్ సల్మాన్ (Dulquer Salman) 'సీతారామం' సినిమాలు విడుదలై సంగతి తెలిసిందే. ఇక, ఈ రెండు సినిమాలు ఎలాంటి ఘన విజయాన్ని అందుకున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రెండు చిత్రాలు బాక్సాఫీసు వద్ద పోటాపోటీగా కలెక్షన్స్‌ రాబడుతున్నాయి. ఈ క్రమంలో ఈ సినిమాల హిట్‌పై ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  

'బింబిసార'(Bimbisara) , 'సీతా రామం' హిట్‌ అయ్యాయని ఆనందపడిపోకూడదు. భవిష్యత్తులో తెరకెక్కించే ప్రతి చిత్రాన్ని మంచి కంటెంట్‌తో రూపొందించాలి. మూడు, నాలుగు రోజుల కలెక్షన్స్‌ చూసి సంబరాలు చేసుకోకూడదు" అని నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు.

'బింబిసార' ను వీక్షించిన ఆయన సినిమా గురించి తమ్మారెడ్డి భరద్వాజ (Tammareddy Bharadwaja) తన అభిప్రాయాలు పంచుకుంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక ఈ చిత్రం రెగ్యులర్‌ కమర్షియల్‌ కథేనని.. కొత్త కథేమీ కాదని చెప్పారు. దర్శకుడు వశిష్ఠ ఈ సినిమాను ఆకట్టుకునేలా తీర్చిదిద్దారని మెచ్చుకున్నారు.  

ఇక, టైం ట్రావెల్‌ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రాన్ని 'ఆదిత్య 369' (Aditya 369) తో పోల్చి చూడటం సరికాదన్నారు. ఆ సినిమాకు, ఈ సినిమాకు అసలు పోలీకే లేదన్నారు. బింబిసారుడు అనే ఓ క్రూరమైన రాజు కథను తీసుకుని టైం ట్రావెలర్‌లో ఆ రాజు సున్నితంగా ఎలా మారాడో చూపించి ఈ చిత్రాన్ని ఆసక్తిగా తీశారు. మంచి కంటెంట్‌ ఉంటే ప్రేక్షకులు తప్పకుండా సినిమాను ఆదరిస్తారని చెప్పారు.

'సీతారామం' (Sitaramam) మూవీ అద్భుతమైన ప్రేమ కావ్యమన్నారు. ఫస్ట్‌హాఫ్‌లో కశ్మీర్‌ పండితుల సమస్యను నిజాయితిగా చూపించారు. అలాగే హిందూ ముస్లిం వంటి అంశాలను తీసుకుని అద్భుతమైన ప్రేమ చిత్రంగా మలిచాడు డైరెక్టర్‌. ఓ అనాథను జవాన్‌గా తీసుకోవడం మంచి కాన్సెప్ట్‌ అన్నారు. ఇలాంటి సున్నితమైన ఎన్నో సమస్యలను తీసుకుని మంచి సినిమాగా తీర్చిదిద్దిన డైరెక్టర్‌ను తప్పనిసరిగా అభినందించాల్సిన విషయమన్నారు.

Read More: Mrunal Thakur: బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్న 'సీతారామం'.. దర్శకుడిని హత్తుకొని ఏడ్చేసిన మృణాళ్‌ ఠాకూర్!

Credits: Instagram
You May Also Like These