'ఆర్ఎక్స్ 100' (RX 100) సినిమాతో టాలీవుడ్ కు హీరోయిన్ గా పరిచయమైన పాయల్ రాజ్‌పుత్ కు ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. తొలి సినిమానే బ్లాక్ బస్టర్ హిట్టై, ఆమె నటనకు ప్రశంసలు దక్కినా ఆ సినిమా ద్వారా వచ్చిన బోల్డ్ ఇమేజ్ పాయల్ కు మైనస్ గా మారింది. ఆ తరువాత పాయల్ (Payal Rajput) పలు సినిమాల్లో నటించినా పాత్రచిత్రణ సరిగా లేకపోవడం వల్ల ప్రతిభ ఉన్నా స్టార్ హీరోయిన్ గా పాయల్ కు గుర్తింపు మాత్రం దక్కలేదు.
ప్రస్తుతం పాయల్ రాజ్‌పుత్ ‘హెడ్ బుష్’ (Head Bush) అనే సినిమాతో కన్నడ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతోంది. ఈ సినిమాలోని తన పాత్రకు ఈ బ్యూటీ డబ్బింగ్ చెప్పుకుంటోంది. "నా రాబోయే కన్నడ చిత్రం “హెడ్ బుష్”కి నేనే డబ్బింగ్ చెప్పే అవకాశం వచ్చింది. సినిమాలో నా పాత్ర చాలా డీప్‌గా, బలంగా, ఛాలెంజింగ్‌గా ఉన్నందు వల్ల నా లైన్లకు డబ్బింగ్ చెప్పడానికి ఉత్సాహంగా ఉన్నా. నా పాత్ర పర్ఫెక్ట్గా ఉండాలనుకున్నా..అందుకోసం కేవలం నా వాయిస్ ఇస్తేనే న్యాయం జరుగుతుందని అనిపించింది. వాయిస్ ఇవ్వడం అంత సులభమైనది కాదు, కానీ నా హద్దులను చెరిపేయడం నాకిష్టం..హెడ్‌బుష్ అక్టోబర్ 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.." అంటూ ఇన్ స్టాగ్రామ్‌లో ఓ సందేశాన్ని పోస్ట్ చేసింది పాయల్. ఆమె డబ్బింగ్ (Payal Rajput Dubbing) చెబుతున్న ఫోటోను షేర్ చేసింది. ప్రస్తుతం ఆమె షేర్ చేసిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.
పాయల్ రాజ్‌పుత్ స్వస్థలం ఢిల్లీయే అయినా తెలుగు, తమిళం, కన్నడ సినిమాల్లో ఫుల్ బిజీ అయిపోయింది. ప్రస్తుతం తెలుగులో మంచు విష్ణుతో (Manchu Vishnu) కలిసి 'జిన్నా' (Ginna Movie) సినిమాతోపాటు కిరాతక చిత్రంలో నటిస్తోంది పాయల్.
ఇదిలా ఉంటే.. కొంతమంది హీరోయిన్లు ఇండస్ట్రీలోకి వచ్చి చాలా సంవత్సరాలే అయినా ఒక్క సినిమాలో కూడా వీళ్లు సొంతంగా డబ్బింగ్ చెప్పుకోరు.మరి కొందరు హీరోయిన్లు అయితే అసలు తెలుగు నేర్చుకోవడానికి కూడా ప్రయత్నం చేయరు. ఒకరిద్దరు స్టార్ హీరోయిన్లు తమ సినిమాలకు డబ్బింగ్ చెప్పుకున్నా మిగతా హీరోయిన్లు అంతా డబ్బింగ్ చెప్పడానికి అసలు ఆసక్తి చూపడం లేదు.
పలు ఇంటర్వ్యూలలో డబ్బింగ్ గురించి ఇప్పుడిప్పుడే తెలుగు నేర్చుకుంటున్నామని భవిష్యత్తులో డబ్బింగ్ చెబుతామని మాటలు చెబుతూ ఉంటారు.అయితే యంగ్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ (Payal Rajput) మాత్రం దశాబ్దాలుగా స్టార్ హీరోయిన్లు అనిపించుకుంటున్న వాళ్ల కంటే తనే గ్రేట్ అని ప్రూవ్ చేసుకుంటోంది.
Read More: దుమ్ము రేపుతున్న హీరో ఆది 'తీస్మార్ ఖాన్' టీజర్.. పాయల్ రాజ్‌పుత్‌తో రొమాన్స్ అదుర్స్!
Follow Us