Rashmika Mandanna: రెడ్ డ్రెస్ లో రష్మిక మందన్న హాట్ పోజులు.. కుర్రాళ్ల మతిపోవాల్సిందే!

Published on Jul 17, 2022 04:29 PM IST

Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అతికొద్ది సమయంలోనే టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌గా మారిపోయిన ఈ బ్యూటీ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉంది. తెలుగు, తమిళంలోనే కాకుండా హిందీలోనూ వరుస సినిమాలతో దూసుకెళ్తోంది ఈ అమ్మడు. 

కాగా, ఈ మధ్యకాలంలో రష్మిక మందన్న (Rashmika Mandanna) హాట్ డోస్ పెంచుతూ వస్తోంది. సినిమాలతో పాటు రియల్ లైఫ్ లో కూడా గ్లామర్ ట్రీట్ ఇస్తూ కుర్రాళ్లను తెగ అట్రాక్ట్ చేస్తోంది ఈ కన్నడ సోయగం. ఈ క్రమంలోనే తాజాగా ఆమెకు సంబంధించిన కొన్ని ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. శుక్రవారం (జులై 15) రాత్రి ముంబయిలో జరిగిన ఓ అవార్డు ప్రోగ్రామ్‌కు హాజరైంది రష్మికా. ఈ ఫంక్షన్‌లో రష్మిక రెడ్ కలర్ షార్ట్‌ డ్రెస్‌లో సందడి చేసింది. 

ఈ కార్యక్రమంలో రష్మికా ఇలా ఎంటర్ అవుతుందో లేదో అక్కడున్న ఫొటోగ్రాఫర్లంతా ఆమె వెంటే పడి సెకన్ల వ్యవధిలో కెమెరాలను క్లిక్ అనిపించారు. ర‌ష్మిక అందాల‌ను త‌మ కెమెరాల్లో బంధించ‌డానికి పోటీ పడుతూ వరుసపెట్టి ఫొటోస్ తీశారు. ఇక, ఈ ఫొటోస్ చూసి సూపర్ హాట్ రష్మిక (Rashmika Hot Photos) అంటూ ఫిదా అయిపోతున్నారు నెటిజన్లు. 

రష్మిక ఈ ఫొటోల్లో ఒకపక్క ఎద అందాలు ఆరబోసేలా పూర్తి స్థాయిలో స్లీవ్ లెస్ గౌన్ వేసుకున్న ఆమె తొడల అందాలు కూడా కనిపించే విధంగా ఆ డ్రెస్ ను డిజైన్ చేసుకుంది. ఆమెను ఒక సోఫాలో కూర్చొబెట్టి ఫొటోలు దిగారు అభిమానులు. అయితే రష్మిక పైకి నవ్వుతున్నప్పటికీ.. కొంచెం ఇబ్బందిపడినట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఆ డ్రెస్‌ (Rashmika in Red Dress) ఆమె మోకాలి పై వరకు ఉంది. దీంతో తన కాళ్లు కవర్‌ చేసుకునేందుకు రష్మికా ప్రయత్నించడం చూడవచ్చు. 

Read More: జిమ్ లో తీవ్ర కసరత్తులు చేస్తున్న 'పుష్ప' (Pushpa Movie) బ్యూటీ రష్మిక మందన్నా..!