Actress Sukruthi: సినీ ఇండస్ట్రీలో కొందరు నటీనటులు తొలి సినిమా చేయడంతోనే మంచి క్రేజ్ దక్కించుకుంటారు. ముఖ్యంగా కాలేజీ లవ్ నేపథ్యంలో తెరకెక్కే సినిమాలలో కనిపించే హీరోయిన్స్ యూత్‌ని అమితంగా ఆకర్షిస్తుంటారు. ఆ విధంగా తెలుగులో చేసిన ఒకే ఒక్క సినిమాతో మంచి ఫేమ్ తెచ్చుకున్న బ్యూటీ సుకృతి అంబటి.
ఈ బ్యూటీ గురించి నేరుగా సుకృతి అని పేరు చెబితే గుర్తుపట్టడం కష్టమే కావచ్చు. కానీ 2017లో డైరెక్టర్ సాయికిరణ్ అడవి దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో సుమంత్ అశ్విన్ కథానాయకుడిగా నటించిన 'కేరింత' (Kerintha Movie) సినిమాలో భావన పాత్రలో నటించిన అమ్మాయి అంటే టక్కున గుర్తుపట్టే అవకాశం ఉంది. భావన పాత్ర 'కేరింత' సినిమాకే ప్లస్ అయింది. భావన రోల్లో సుకృతి జీవించింది.
నిజానికి హీరోయిన్ కన్నా ఎక్కవ నిడివి గల పాత్ర సుకృతిది (Actress Sukruthi). ఈ ఒక్క సినిమాతోనే యూత్‌ను కళ్ళు తిప్పుకోకుండా చేసింది. ఈ సినిమాలో తన నటన, క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈమె సినిమాలను దూరంగా ఉంటోంది. ఇక ఈ సినిమా తర్వాత సుకృతీ మరెక్కడా కూడా ఇండస్ట్రీలో కనిపించలేదు. ఆ
మె తన వ్యక్తిగత కారణాల వల్ల పెద్దగా సినిమాలు చేయలేదు. అయితే సినిమాలకు దూరంగా ఉన్నా.. సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది సుకృతి. ఇన్ స్టాగ్రామ్‌లో ఎప్పటికప్పుడు ఫోటోలను పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్‌ను పలకరిస్తుంది.
అయితే ఆమెకు సంబంధించిన ఓ న్యూస్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. సుకృతి త్వరలో పెళ్లి పీటలెక్కనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అక్షయ్ సింగ్ అనే వ్యక్తితో నిశ్చితార్థం (Sukruthi Engagement) చేసుకుంది. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను సుకృతి సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో పలువురు సినీ నటులు, అభిమానులు నూతన జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఈ నేపథ్యంలో సుకృతి తన ఇన్ స్టాగ్రామ్‌లో తన తండ్రి గురించి పోస్ట్ చేస్తూ.. 'నా ప్రపంచం నాన్న. భయపడినప్పుడు నా భుజం తడుతూ, నన్ను సంతోషపరుస్తూ, నా చేయి పట్టుకుని నడిపిస్తూ నిత్యం నా వెంటే ఉన్నాడు. ఎప్పుడు ఉత్తమ నాన్నలాగే ప్రవర్తించాడు. ఐదేళ్ళ క్రితం అమ్మ చనిపోయింది. అప్పటి నుండి అమ్మ ప్రేమను సైతం తానే అందించాడు. సింగిల్ పేరెంట్‌గా ఉండటం అంత సులువేం కాదు. నాకు తెలిసిన బలమైన వ్యక్తివి నువ్వే నాన్న.. ఎప్పటికీ నువ్వే నా ఫస్ట్ లవ్' అంటూ ఎమోషనల్ పోస్ట్ (Emotional Post) రాసుకొచ్చింది.
Read More: Biggboss Season6: త్వరలో బిగ్ బాస్ సీజన్ 6.. వైరల్ అవుతున్న కంటెస్టెంట్స్ లిస్ట్!
Follow Us