Ante Sundaraniki Movie: 'అంటే సుందరానికి..' మూవీ సక్సెస్ మీట్.. డాషింగ్ లుక్ లో హీరో నాని, నజ్రియా

Published on Jun 18, 2022 08:08 PM IST

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇటీవలే నాచురల్ స్టార్ నాని (Hero Nani) హీరోగా నటించిన “అంటే సుందరానికీ” సినిమా రిలీజ్ అయి మంచి విజయం సాధించింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో.. వివేక్ ఆత్రేయా ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో న‌జ్రియా హీరోయిన్‌గా న‌టిచింది. భారీ అంచ‌నాలు నడుమ గ‌త శుక్ర‌వారం విడుద‌లైన ఈ చిత్రం పాజిటీవ్ రివ్యూల‌ను తెచ్చుకుంది.  నాని గత చిత్రాలను పోల్చుకుంటే అంటే సుందరానికీ లోయెస్ట్ ఓపెనింగ్స్‌ను రాబట్టింది. 

బాక్సాఫీస్ వద్ద మంచి ఫ్యామిలీ ఫన్ ఎంటర్టైనర్ గా నిలిచి హిట్ కొట్టింది. ఇక ఇక్కడ కలెక్షన్స్ లో పర్వాలేదనిపించినా యూఎస్ బాక్సాఫీస్ వద్ద భారీగానే వసూలు చేస్తుంది. నానికి (Hero Nani) అమెరికాలో కూడా మంచి మార్కెట్ ఉంది. నాని ఇప్పటికే పలు సినిమాలతో అమెరికాలో 1 మిలియన్ డాలర్ మార్క్ ని అందుకున్నాడు. తాజాగా వచ్చిన అంటే సుందరానికి సినిమాతో కూడా ఈ ఫీట్ సాధించి సరికొత్త రికార్డ్ సాధించాడు. 

అక్కడ.. నాని వరుసగా ఏడు సినిమాలతో 1 మిలియన్ డాలర్ మార్క్ అందుకొని రికార్డు సృష్టించాడు. మొదటి వారంలో మంచి కలెక్షన్స్ సాధించిన 'అంటే సుందరానికి' మూవీ (Ante Sundaraniki Movie) తాజాగా అమెరికా బాక్సాఫీస్ వద్ద 1 మిలియన్ మార్క్ ని క్రాస్ చేసింది. మరో సారి ఈ రికార్డుతో నాచురల్ స్టార్ అనిపించుకున్నాడు. కాగా, నాని ప్రస్తుతం 'దసరా' సినిమా చిత్రీకరణలో ఉన్నాడు.