Ante Sundaraniki: ‘అంటే సుంద‌రానికి..’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాని, న‌జ్రియా సూపర్ డ్యాన్స్.. వీడియో వైరల్

Published on Jun 11, 2022 03:01 PM IST

Ante Sundaranikiఫ టాలీవుడ్ నాచుర‌ల్ స్టార్ హీరో నాని (Nani), న‌జ్రియా న‌జీమ్ (Nazriya) కాంబినేష‌న్‌లో తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌ ‘అంటే సుంద‌రానికి’. వివేక్ ఆత్రేయ (Vivek Athreya) డైరెక్ష‌న్‌లో వ‌చ్చిన ఈ చిత్రం జూన్ 10న (శుక్ర‌వారం0 థియేట‌ర్ల‌లో గ్రాండ్‌గా విడుద‌లయింది. 'జెర్సీ' తర్వాత నానికి సరైన సక్సెస్ పడలేదు. 'గ్యాంగ్ లీడర్', 'వి', 'టక్ జగదీష్', 'శ్యామ్ సింఘరాయ్' ఆశించిన ఫలితాలు సాధించలేదు. 

ఈ నేపథ్యంలో సినిమా ప్రీ రిలీజ్ లెక్కలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ సినిమా వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ (ొ్ాలొిుడలన ిుం్ొత) 28 కోట్లకు అమ్మడుపోయాయి. నైజాం- రూ.9 కోట్లు.. సీడెడ్- రూ.3 కోట్లు.. ఆంధ్ర రూ.10 కోట్లు.. ఏపీ తెలంగాణ మొత్తం కలపగా రూ.22 కోట్లు బిజినెస్ జరిగింది. ఇక రెస్టాఫ్ ఇండియా - రూ.2.5 కోట్లు.. ఓవర్సీస్ రూ.3.50 కోట్లు మొత్తం వరల్డ్ వైడ్ బిజినెస్ రూ.28 కోట్లని తెలుస్తోంది. ఇక అడ్వాన్స్ బుకింగ్ ల పరంగా చూస్తే దేశీయ మార్కెట్ తో పోలిస్తే ఓవర్సీల్ బాగున్నాయి. బుకింగ్స్ అక్కడా జోరుగా సాగుతున్నాయి. 

కాగా, ఇటీవల శిల్ప‌క‌ళా వేదిక‌లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ (Pre Release Event) లో నజ్రియా, నాని ఈ సినిమాలోని ఓ ట్రాక్‌కు డ్యాన్స్ చేశారు. నాని, అంజు యెల‌వ‌ర్తితో రీలింగ్ అండ్ ఫీలింగ్..బాయ్స్ ఇపుడిక మీ వంతు అని సోషల్ మీడియాలో క్యాప్ష‌న్ ఇచ్చింది నజ్రియా. బ్యాక్ డ్రాప్‌లో స్క్రీన్‌పై సాంగ్ విజువ‌ల్స్ ప్లే అవుతుండ‌గా.. అదే పాట‌కు నాని, న‌జ్రియా, అంజు క‌లిసి చేసిన డ్యాన్స్ ఇపుడు నెట్టింట్లో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. ఈ చిత్రంలో రోహిణి, న‌రేశ్, విష్ణువ‌ర్ద‌న్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.