Shraddha das: అందాల ఆరబోతలో ఏ మాత్రం తగ్గేదే లేదు అంటున్న సొట్ట బుగ్గల బ్యూటీ శ్రద్ధా దాస్..!
టాలీవుడ్ లో బ్యూటిఫుల్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది సొట్టబుగ్గల సుందరి శ్రద్ధా దాస్ (Shraddha das). ఈ బ్యూటీ తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ చిత్రాల్లో నటించినా ఎక్కడా బ్రేక్ దక్కలేదు. ప్రస్తుతం పలు చిత్రాలతో పాటు వెబ్ సిరీస్, టీవీ షోలపై దృష్టి పెట్టిందీ హాట్ బ్యూటీ. అందాల ఆరబోతలో ఏ మాత్రం తగ్గడం లేదు ఈ శ్రద్ధా దాస్. అయితే, ఈ అమ్మడికి 35ఏళ్ల వయసు వచ్చినా పెళ్లి మాట మాత్రం ఎత్తడం లేదు.
శ్రద్దాదాస్ తాజాగా నటించిన చిత్రం 'అర్థం' (Artham). ఇందులో మాయ అనే సైకియాట్రిస్ట్ పాత్రలో అలరించనుంది ఈ అమ్మడు. మినర్వా పిక్చర్స్ బ్యానర్ పై ఈ సినిమాను రాధిక శ్రీనివాస్ నిర్మించారు. ఇంతకు ముందు అనేక చిత్రాలకు ఎడిటర్‌గా, వీఎఫ్ఎక్స్ నిపుణుడిగా పని చేసి గుర్తింపు తెచ్చుకున్న మణికాంత్ తెల్లగూటి దర్శకత్వంలో డిఫరెంట్ సైకలాజికల్ థ్రిల్లర్‌గా ఈ మూవీని తెరకెక్కించారు.
'దేవి', 'పెదరాయుడు' చిత్రాలతో బాలనటుడిగా గుర్తింపు తెచ్చుకున్న మాస్టర్ మహేంద్రన్, ఆమని (Aamani), అజయ్, ఈటీవీ ప్రభాకర్, జబర్దస్త్ రోషిణి (Jabardasth Roshini), లోబో, నందా దురైరాజ్, సాహితి నటించారు. ఈ సినిమాను తమిళం, తెలుగు భాషల్లో రాధిక శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. అలాగే మళయాళ, కన్నడ భాషల్లోకి డబ్ చేసి విడుదల చేయనున్నారు. సెప్టెంబర్ చివరి వారంలో విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ మూవీ టీజర్‌ను (Artham Teaser) హైదరాబాద్ లో విడుదల చేసింది చిత్రబృందం.
ఈ సందర్భంగా శ్రద్దాదాస్ (Shraddha das) మాట్లాడుతూ.. ''ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలన్నిటికంటే ఈ సినిమా నాకు ఎంతో స్పెషల్. ఇలాంటి హార్రర్ చిత్రాలకు విఎఫ్ఎక్స్ చాలా ముఖ్యం. డిఓపి పవన్ గారు నన్ను చాలా అందంగా చూపించారు. డైరెక్టర్ మణికాంత్ గారు, నిర్మాతలు చక్కని కథను సెలెక్ట్ చేసుకొని ఈ సినిమాను చాలా చక్కగా తెరకెక్కించారు. ఈ చిత్రంలో గ్లామర్ రోల్లో సైక్రియాట్రిస్ట్ గా నటించాను. ఈ మూవీలోని నా పాత్ర చాలా ప్రత్యేకంగా ఉంటుంది అని పేర్కొంది.