మేడే (May day) వేడుక‌ల్లో మెగాస్టార్ చిరంజీవి

Published on May 02, 2022 02:07 PM IST

ప్రపంచ కార్మికుల దినోత్స‌వం (May day) సంద‌ర్భంగా  హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన మే డే (May day) వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) పాల్గొన్నారు. ఈ కార్య‌క్ర‌మానికి మంత్రులు మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, మహమూద్‌ అలీ, శ్రీనివాస్‌ గౌడ్‌, కేంద్రమంత్రి కిష‌న్ రెడ్డి తదితరులు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడిన తెలంగాణ సినిమాటోగ్ర‌ఫి మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్ (Minister Talasani Srinivas Yadav)  తెలుగు చిత్రపరిశ్రమ (Telugu film industry)కు ఆయ‌న‌ పెద్ద దిక్కుగా ఉన్నారని అన్నారు.

అనంత‌రం చిరంజీవి మాట్లాడుతూ.. ప్రపంచంలో ఏ రంగంలోనైనా కార్మికులకు ఒక నిర్ణీతమైన పనిగంటలు ఉంటాయి.  వాళ్లు తమ పనిని 8 గంటలపాటు చేస్తారు. ఆయా పనులను బట్టి ఆ 8 గంటల్లోనే ఎంతో కష్టపడేవారు ఉంటారు. కానీ అలాంటి ఒక నిర్ణీతమైన సమయమనేది లేకుండా పని చేసేది ఒక్క సినిమా కార్మికులు మాత్రమే అంటూ 'మేడే' సందర్భంగా చిరంజీవి మాట్లాడారు. హైదరాబాద్  -  యూసఫ్ గూడాలో నిన్న జరిగిన సినీ కార్మికోత్సవంలో ప్రసంగిస్తూ చిరంజీవి ఈ మాట అన్నారు.

ఆచార్య త‌ర్వాత‌ నేను న‌టిస్తున్న‌ 'గాడ్ ఫాదర్' సినిమా షూటింగు ఈ మధ్య కోసం హైదరాబాద్-ముంబై అదే పనిగా తిరగవలసి వచ్చింది. నిజానికి నేను చాలా అలసిపోయాను. కానీ ఆ విషయం చెబితే  షూటింగు ఆగిపోతుంది. సినిమాను నమ్ముకున్న కార్మికులకు  ఇలాంటి కష్టాలు ఎన్నో ఉంటాయి. అందువల్లనే వారి నిత్వసర వస్తువుల పంపిణీ .. వ్యాక్సినేషన్  ఇప్పించే విషయంలో నేను బాధ్యత తీసుకున్నాను అని వివ‌రించారు.