Ravi Teja: 'టైగర్ నాగేశ్వర్ రావు' సినిమా షూటింగ్‌లో గాయపడ్డ మాస్ మహారాజ రవితేజ..!

రవితేజ, టైగర్ నాగేశ్వర్ రావు (RaviTeja, Tiger Nageswar rao)

టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) వరుస ప్రాజెక్ట్‌లతో బిజిబిజీగా గడుపుతున్నాడు. దాదాపు ఒకేసారి అరడజను సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఒకటి తర్వాత ఒకటి చిత్రాలను సైన్ చేస్తూ.. అన్ని షూటింగ్స్‌ను ఒకేసారి మ్యానేజ్ చేస్తున్నాడు ఈ హీరో. ఇదివరకు ‘రామారావు ఆన్ డ్యూటీ’ (Ramarao On Duty) మూవీని పూర్తి చేసిన రవితేజ.. ప్రస్తుతం ‘టైగర్‌ నాగేశ్వరరావు’ షూటింగ్‌లో పాల్గొంటున్నాడు.

1970 ల నేప‌థ్యంలో సాగే ఈ చిత్రంలో ర‌వితేజ ఇప్ప‌టి వ‌ర‌కు ప్రేక్ష‌కులు చూడ‌ని గెట‌ప్‌లో క‌నిపించ‌నున్నారు. 'దొంగాట' ఫేమ్ వంశీ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇందులో నుపూర్ స‌న‌న్‌, గాయ‌త్రి భ‌ర‌ద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

స్టువర్ట్ పురానికి చెందిన గజదొంగ 'టైగర్ నాగేశ్వరరావు' (Tiger Nageswara Rao) జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. కొన్నాళ్లుగా ఈ మూవీ చిత్రీకరణ జరుపుకుంటోంది. భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక టైగర్ నాగేశ్వరరావు పాన్ ఇండియా చిత్రంగా పలు భాషల్లో విడుదల కానుంది.

కాగా, ఈ సినిమా కోసం ఓ భారీ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తుండగా హీరో రవితేజ ప్రమాదానికి గురయ్యాడు. ఆయన వేలాడుతున్న తాడు పట్టు తప్పడంతో క్రింద పడ్డారట. ఈ అనుకోని ప్రమాదంలో రవితేజకు గాయాలైనట్లు సమాచారం. చర్మం తెగిపోవడంతో పది కుట్లు పడ్డాయట. అయినప్పటికీ రవితేజ విశ్రాంతి తీసుకోకుండా చిత్రీకరణలో పాల్గొన్నట్లు సమాచారం.

వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని రవితేజకు సూచించినా.. ఇతర నటులు, స్టంట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ డేట్స్ ఖాళీగా లేకపోవడంతో.. ఇప్పుడే యాక్షన్ సీన్స్‌ను పూర్తి చేయాలని రవితేజ (Ravi Teja) నిర్ణయించుకున్నారట. ముఖ్యంగా ప్రొడ్యూసర్లు  ఇబ్బంది పడకూడదని, అలాగే సాంకేతిక నిపుణుల డేట్స్‌లో మార్పు రాకూడ‌ద‌నే ఉద్దేశంతో వెంటనే షూటింగ్ స్పాట్‌కి రవితేజ వచ్చినట్లు తెలుస్తోంది.

ఈ ప్రమాదం కొద్ది రోజుల కింద చోటు చేసుకోగా.. గురువారం రవితేజ షూటింగ్‌‌లో పాల్గొన్న సందర్భంలో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో రవితేజ నిబద్ధతకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. మరోవైపు రవితేజ హీరోగా నటించిన 'రామారావు ఆన్ డ్యూటీ' (Ramarao On Duty) విడుదలకు సిద్ధంగా ఉంది. జవనరి నుంచి ఈ సినిమా వాయిదా పడుతూనే వస్తోంది. జూన్ 17న రిలీజ్ చేస్తామని ప్రకటించినా.. మళ్లీ పోస్ట్‌పోన్ అయింది. శ‌ర‌త్ మండ‌వ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ మూవీలో రవితేజ ఎం.ఆర్‌.ఓ ఆఫీసర్‌ క్యారెక్టర్‌లో నటించారు. ఈ మూవీ రిలీజ్ డేట్ కోసం మాస్ మహారాజా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

Read More: Junior NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేత .. చెన్నై బిర్యానీ తినిపించిన కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ ..!

You May Also Like These