హిందీ సినిమాల్లో నటించడంపై అల్లు అర్జున్ (Allu Arjun) కామెంట్లు వైరల్

అల్లు అర్జున్ (Allu Arjun)

మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడిగా, అల్లు వారి వారసుడిగా టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చి ఐకాన్ స్టార్‌గా ఎదిగారు అల్లు అర్జున్ (Allu Arjun) . ఈ యంగ్ హీరో నటనతోపాటు డ్రెస్సింగ్ స్టైల్‌కి, డ్యాన్స్‌లకి  విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ యంగ్ హీరో దువ్వాడ జగన్నాథం, ఆర్య, సరైనోడు వంటి డబ్బింగ్ చిత్రాలతో పాపులారిటీ సంపాదించుకున్నారు.

కేరళలో అయితే బన్నీకి ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. అందుకే బన్నీని అక్కడ మల్లు అర్జున్ అని పిలుచుకుంటారు అభిమానులు. పోయినేడాది సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన మూవీ ‘పుష్ప: ది రైజ్’ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదలై మంచి సక్సెస్‌ సాధించింది.

దీంతో ఈ నటుడు ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగారు. మొదటి భాగం సూపర్ హిట్ కావడంతో సెకండ్ పార్ట్ ‘పుష్ప: ది రూల్’పై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ క్రమంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ (Allu Arjun) మాట్లాడారు. ఈ సందర్భంగా హిందీ సినిమాల గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు అల్లు అర్జున్.

కంఫర్ట్‌గా అనిపించకనే..

హిందీలో నటించడం నాకు కంఫర్ట్‌గా అనిపించదు. అయినా అవసరం అనుకుంటే కచ్చితంగా చేస్తాను. పూర్తిగా ఇన్‌వాల్వ్ అవుతాను అని చెప్పుకొచ్చారు బన్నీ. నాకు హిందీ సినిమా ఆఫర్ వచ్చింది. కథ ఏ మాత్రం ఆసక్తికరంగా లేకుండా చాలా కామన్‌గా ఉంది. అందుకే ఆ అవకాశాన్ని వదులుకున్నా. మంచి కథ వస్తే త్వరలో చేస్తానని అనుకుంటున్నా. అక్కడ చేయడానికి చాలా ధైర్యం కావాలి అని తెలిపారు అల్లు అర్జున్ (Allu Arjun). గతేడాది డిసెంబర్‌ 17న విడుదలైన ‘పుష్ప: ది రైజ్’ 2021లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది.  

Read More : మహేష్‌బాబు (MaheshBabu) ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాపై ప్రకాష్‌రాజ్‌ కామెంట్లు

You May Also Like These