Bimbisara: 'బింబిసార' సినిమాలో నందమూరి కల్యాణ్ రామ్ నటనపై అల్లు అర్జున్ (Allu Arjun) కామెంట్లు.. ట్వీట్ వైరల్

అల్లు అర్జున్ (Allu Arjun) ఈ సినిమా గురించి పోస్ట్ చేశారు. 'బింబిసార' మూవీలో కళ్యాణ్ రామ్ నటన ప్రభావవంతంగా ఉందని చెప్పుకొచ్చారు.

నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) హీరోగా నటించిన తాజా సినిమా 'బింబిసార' (Bimbisara) పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. శుక్ర‌వారం విడుద‌లైన ఈ చిత్రం మొద‌టి షో నుంచే మంచి టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ వద్ద వ‌సూళ్ళ ప్ర‌భంజ‌నం సృష్టిస్తోంది. ఈ సినిమాను దర్శకుడు వశిష్ఠ తెరకెక్కించగా, ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ పర్ఫార్మెన్స్ మరో లెవెల్‌లో ఉందని ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు. ఈ సినిమాకు ప్రేక్షకులతో పాటు పలువురు సెలబ్రిటీలు సైతం ఫిదా అవుతున్నారు. 

తాజాగా టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) 'బింబిసార' సినిమా గురించి పాజిటివ్‌గా ఓ పోస్ట్ చేశారు.  ఎంతో ఆకర్షణీయమైన, ఆసక్తికరమైన ఫాంటసీ మూవీ 'బింబిసార' అని బన్నీ తెలిపారు. 'బింబిసార' మూవీలో కళ్యాణ్ రామ్ నటన ఎంతో ప్రభావవంతంగా ఉందని ఆయన చెప్పుకొచ్చారు.

తొలి ప్రయత్నంలోనే 'బింబిసార' మూవీని అద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడు వశిష్టకు.. ఇతర సభ్యులకు, సాంకేతిక బృందానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ బన్నీ కామెంట్లు చేశారు. 

ఇక 'బింబిసార' చిత్రం క‌ళ్యాణ్‌రామ్ (Nandamuri Kalyan Ram) కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్‌ను తీసుకొచ్చింది. కేవ‌లం రెండు రోజుల్లోనే ఈ చిత్రం సుమారు రూ.13 కోట్ల‌కు పైగా క‌లెక్ష‌న్‌ల‌ను సాధించింది. ఆదివారంతో ఈ చిత్రం బ్రేక్ ఈవెన్‌ను పూర్తి చేసుకుని, లాభాల బాట ప‌ట్ట‌నుంది. ఇక, ఈ చిత్రంలో బింబిసారుడిగా కళ్యాణ్‌రామ్ న‌ట‌న వ‌ర్ణ‌నాతీతం. ఆయన స్క్రీన్ ప్ర‌జెన్స్‌, డైలాగ్ డెలివ‌రీ ప్రేక్ష‌కుల‌ను విపరీతంగా ఆక‌ట్టుకున్నాయి.

తెలుగులో టైమ్ ట్రావెల్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన చిత్రాలు చాలా తక్కువ. అలా నూతన కథాంశంతో ఏ సినిమా వచ్చినా, ప్రేక్షకులు ఆదరిస్తారు. ఇప్పుడు అలాంటి కథాంశంతోనే 'బింబిసార' (Bimbisara Movie) మూవీ తెరకెక్కింది. టైమ్ ట్రావెల్ కథకు కాస్త పీరియాడిక్ డ్రామా జోడించి, ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చింది మూవీ టీమ్. దీంతో ఆడియన్స్ అంతా ఈ మూవీకి ఫిదా అయిపోతున్నారు. 

Read More: Bimbisara Update: 'బింబిసార'లో రాజకుమారి 'ఐరా' పాత్రలో కేథరిన్ (Catherine Tresa).. ఇంట్రడక్షన్ వీడియో వైరల్!

Credits: Twitter
You May Also Like These