Daksha Nagarkar: తన అందాలతో కట్టిపడేస్తున్న టాలీవుడ్ హీరోయిన దక్షా నగార్కర్!

Published on Jun 06, 2022 05:25 PM IST

హీరోయిన్ దక్ష నగార్కర్ (Daksha Nagarkar).. తెలుగులో 'హుషారు' మూవీతో గుర్తింపు తెచ్చుకుంది. ఆమె నటించిన 'జాంబీరెడ్డి' సినిమా ద్వారా చక్కటి పెర్ఫార్మెన్స్ అందించింది. అయితే అందంలో ఎవరికీ ఏమాత్రం తీసిపోని దక్షకు ప్రస్తుతం సరైన అవకాశాలు రావట్లేదు. దీంతో సోషల్ మీడియాలో తన ఫొటోలను షేర్ చేస్తూ సందడి చేస్తోంది. అభిమానులతో తన అభిప్రాయాలు పంచుకుంటూ వస్తోంది. తన హాట్ ఫొటోలు షేర్ చేస్తూ మురిసిపోతోంది. అందాలతో కనువిందు చేస్తోంది. ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది. ఎప్పుడు సామాజిక మాధ్యమాల్లో తన ఫొటోలు పోస్టులు పెడుతూ వారి కామెంట్లు చూసి ఎంజాయ్ చేస్తోంది. ప్రేక్షకుల్లో మంచి మార్కులు సంపాదించాలని ఆరాట పడుతోంది. 

ఇక, ఈ బ్యూటీ ప్రస్తుతం రవితేజతో రావణాసుర (Ravanasura) చిత్రంలో నటిస్తోంది. ఇందులో తన అందాలు ఆరబోస్తోంది. గ్లామర్ తో అందరిని పిండేయాలని చూస్తోంది. కాగా, ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. రవితేజ సినిమా కావడంతో మాస్ ను ఎంటర్ టైన్ చేసే పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. ఇందులో హీరోయిన్లుగా దక్ష నగార్కర్ తోపాటు మరో ముగ్గురు ఉన్నారు. మేఘా ఆకాష్, అను ఇమ్మాన్యుయేల్, పూజిత, ఫరీదా అబ్దుల్లా నటిస్తున్నారు దీంతో ఎవరికి వారే మంచి మార్కులు కొట్టేయాలని భావిస్తున్నారు. 

ఇక ఈ చిత్రానికి సుధీర్ వర్మ దర్శకుడు. అక్కినేని హీరో సుశాంత్ (Hero Sushant) కూడా ఓ మంచి పాత్రలో నటిస్తున్నాడు. దీంతో ఈ రావణాసుర చిత్రంపై అందరికీ అంచనాలు ఉన్నాయి. ఎలాగైనా ఇందులో తమ టాలెంట్ చూపించి మరిన్ని చిత్రాల్లో ఆఫర్లు దక్కించుకోవాలని ఆరాటపడుతున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 30న విడుదలకు ఏర్పాట్లు చేస్తున్నారు. 

ప్రస్తుతం కీలక షెడ్యూల్ చిత్రీకరిస్తున్నారు. దీంతో సినిమా నిర్మాణంపై అందరి దృష్టి పడుతోంది. ఈ చిత్రంతో తన దశ తిరిగేలా చూసుకోవాలని దక్ష ఆరాటపడుతోంది. ఆఫర్లు భారీగా వస్తే రాబోయే కాలంలో మంచి భవిష్యత్ ఉంటుందని ఆమె ఆశ. అభిషేక్ పిక్చ‌ర్స్, (Mass maharaja Raviteja) ర‌వితేజ టీం వ‌ర్క్స్ ప‌తాకంపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. హ‌ర్ష‌వ‌ర్ద‌న్ రామేశ్వ‌ర్-బీమ్స్ సిసిరొలియో ద్వయం సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమా సెప్టెంబర్ 30న గ్రాండ్‌గా విడుదలకానుంది.