Charlie777: పాన్ ఇండియా సినిమా ‘ఛార్లి 777’ ప్రమోషన్లలో పాల్గొన్న రానా దగ్గుబాటి, రక్షిత్ శెట్టి
కన్నడ కథానాయకుడు రక్షిత్ శెట్టి (Rakshith Shetty) అతడే శ్రీమన్నారాయణ అనే చిత్రంతో పాన్ ఇండియా ప్రేక్షకుల హృదయాల్లో స్థానాన్ని సంపాదించుకున్నాడు. తాజాగా ఈ హీరో మరో విభిన్నమైన కథా చిత్రం ‘777 ఛార్లి’తో ప్రేక్షకులను ను అలరించడానికి సిద్ధం కాబోతున్నారు. ఈ సినిమా కూడా కన్నడ, తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో మరోసారి పాన్ ఇండియా రేంజ్‌లో ఈ సినిమా జూన్ 10న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కాబోతోంది.
ఇక, ఈ సినిమాలో ఓ కుక్క టైటిల్ పాత్రలో నటించడం విశేషం. హీరో రక్షిత్ శెట్టి (Rakshith Shetty) ఇందులో ప్రధాన పాత్రధారిగా నటిస్తూ జి.ఎస్.గుప్తాతో కలిసి తన పరమ్ వహ్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు. హీరోయిన్ గా సంగీత శ్రింగేరి నటిస్తోంది. కిరణ్ రాజ్.కె దర్శకుడు. ఇక, ఈ సినిమాకు నోబిన్ పాల్ సంగీతం అందిస్తుండగా.. అరవింద్ ఎస్.కశ్యప్ సినిమాటోగ్రఫీ చేస్తున్నాడు. త్వరలో ఈ చిత్ర విడుదల కాబోతున్న సందర్భంగా ఈ సినిమా ప్రెస్‌మీట్ తాజాగా శనివారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి సైతం పాల్గొన్నారు.
ఇక, ఈ కార్యక్రమంలో హీరో రానా దగ్గుబాటి (Rana Daggubati) మాట్లాడుతూ ‘‘పాండమిక్ సమయంలో రక్షిత్‌కి, నాకు ఫోన్ కాల్స్ ద్వారానే పరిచయం ఏర్పడింది. ‘ఛార్లి 777’ వంటి డిఫరెంట్ సినిమా చేస్తున్నారని తెలియగానే .. ఏదో ఇళ్లల్లో చేసేస్తారని నేను అనుకున్నాను. కానీ ట్రైలర్ చూసిన తర్వాత ఎంత స్కేల్, స్పామ్‌లో సినిమా చేశారో అర్థమైంది. చూసిన వెంటనే కళ్లల్లో నీళ్లు వచ్చాయి. చాలా కమర్షియల్ సినిమాలు తెరకెక్కించి సక్సెస్‌లు సాధించే అవకాశాలు ఉన్నప్పటికీ 170 రోజులు.. కాశ్మీర్ సహా వివిధ ప్రాంతాల్లో ఛార్లిని తీసుకెళ్లి షూటింగ్ చేశారు. ఇలాంటి ‘ఛార్లి 777’ సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నందుకు గర్వంగా ఫీల్ అవుతున్నాను’’ అని అన్నారు.