Manchu Manoj: హీరో మంచు మ‌నోజ్ బ‌ర్త్ డే సెల‌బ్రేష‌న్స్.. అభిమానుల హంగామా!

Published on May 20, 2022 04:15 PM IST

టాలీవుడ్ క‌లెక్ష‌న్ కింగ్ మంచు మోహన్ బాబు తనయుడిగా, తెలుగు తెరకు పరిచయమైన హీరో మంచు మనోజ్ (Manchu Manoj). ఆయ‌న హీరోగా కెరీర్ ప్రారంభించిన తొలినాళ్ళలో వైవిధ్యమైన సినిమాలతో ఆకట్టుకున్నాడు. నేను మీకు తెలుసా, పోటుగాడు, మిస్టర్ నూకయ్య, కరెంట్ తీగ లాంటి సినిమాలు ఈయనకు మంచి పేరు తీసుకొచ్చాయి.  ఇటీవలే నిర్మాతగా సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన మనోజ్, నేడు తన అభిమానులతో పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నాడు. ఆయన ఇంటి వద్ద మంచు అభిమానులు, మనోజ్ ఫాలోవర్స్ భారీ ఏర్పాట్లు చేసారు. 

మంచు మనోజ్ (Manchu Manoj) ఇంటికి వచ్చే దారిలో భారీగా ప్లెక్సీలు, హోర్డింగులు ఏర్పాటు చేసారు. అలాగే మనోజ్ ఇంటి చుట్టూ బర్త్ డే బ్యానర్లతో నింపేసారు ఫ్యాన్స్. మనోజ్ నివాసం బయటే కేక్ కటింగ్ ఏర్పాటు చేసారు. ప్రత్యేకంగా అలంకరించిన రథంలో, మనోజ్ తన అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుక జరుపుకున్నారు. ఈ వేడుకలో మంచు మనోజ్ అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొనడం విశేషం. 

మంచు మనోజు (Manchu Manoj) కేక్ కట్ చేస్తుంటే.. టపాసులు పేలుస్తూ, పూలు, రంగు కాగితాలు చల్లుతూ ఫ్యాన్స్ గోల గోల చేసారు. ఆ దారి వెంట వెళ్లే సామాన్య జనం, ఈ హడావుడి చూసి ఆశ్చర్యపోయారు. కాగా, ప్రస్తుతం మనోజ్‌ ‘అహం బ్రహ్మాస్మి’ చిత్రంలో నటిస్తున్నారు. దాదాపు మూడేళ్ల విరామం తర్వాత ఆయన నటిస్తున్న చిత్రమిదే. శ్రీకాంత్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఓ విభిన్నమైన లుక్‌లో ఆయన కనిపించనున్నారు. ఎంఎం ఆర్ట్స్‌ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పాన్‌ ఇండియా మూవీగా ఇది విడుదల కానుంది.