తొలి సినిమాతోనే ఆక‌ట్టుకున్న (Ritika nayak) రితికా నాయ‌క్.. ఇండ‌స్ట్రీకి మ‌రో కొత్త హీరోయిన్!

Published on May 13, 2022 01:45 PM IST

ఇటీవలే మాస్ కా దాస్.. విశ్వక్ సేన్ (Vishwak sen) హీరోగా నటించిన అశోక వ‌నంలో అర్జుణ క‌ల్యాణం సినిమా విడుద‌ల‌యి మంచి విజయం సాధించిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గీ రుక్సర్ థిల్లాన్ మెరిసింది. అయితే ఆమె కంటే కూడా సెకండ్ హీరోయిన్ గా చేసిన రితికానాయ‌క్ (Ritika nayak) కి ఎక్కువ పేరు వచ్చింది. ఈ సినిమా చూసిన ప్రేక్షకులంతా రితికా అందంతో అదరగొట్టేసిందని అంటున్నారు. త‌న కెరీర్ చేసిన‌ మొదటి సినిమాలోనే ఈ అమ్మ‌డు సెకండ్ హీరోయిన్ గా చేసింది. అయినా కూడా బాగానే పాపులారిటీ తెచ్చుకుంది రితికా నాయక్. అయితే, ఈ బ్యూటీ ఒక వ్లాగర్, అలాగే ఆమె మోడలింగ్ కూడా చేస్తూ ఉంటుంది. ఈ మూవీ మొత్తం తన క్యూట్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్న ఈ బబ్లీ బ్యూటీకి భవిష్యత్తులో మంచి సినిమా అవకాశాలు వస్తాయని అందరూ అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు. ఇప్ప‌టికే గీతా ఆర్ట్స్ లాంటి పెద్ద బ్యానర్ లో హీరోయిన్ గా మూడు సినిమాలకి సైన్ చేసిందంటే మామూలు విషయం కాదు. మొత్తానికి ఇండస్ట్రీకి మరో కొత్త హీరోయిన్ దొరికిందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఇక తొలి సినిమా త‌ర్వాత‌ అగ్ర బ్యానర్ లో పడ్డ ఈ భామ కచ్చితంగా సక్సెస్ అవుతుందని ప్రేక్షకులు భావిస్తున్నారు.  ఇటీవలే ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రితికా ఈ విషయం వెల్లడించింది. దీంతో ఈ అమ్మడికి వచ్చిన బంపర్ ఆఫర్ చూసి ఆశ్చర్యపోతున్నారు. 

అయితే, ఈ సినిమా రిలీజ్ కంటే ముందు ఈ భామను ఫ‌స్ట్ లుక్, ట్రైల‌ర్ లో కూడా చూపించ‌లేదు. దీంతో బహుశా సర్ప్రైజింగ్ ప్యాకేజీ లాగా ఉంచడం కోసమే (Ritika nayak)  రితిక నాయక్ ను పెద్దగా హైలెట్ చేయకపోయి ఉండవచ్చు అని భావిస్తున్నారు. అయితే సినిమా మొత్తంలో హీరోయిన్ రుక్స‌ర్ కంటే ఎక్కువగా కనిపించేది రితిక నాయక్. ఇక ఇటీవ‌ల ఈ సినిమా స‌క్సెస్ మీట్ లో పాల్గొన్న అగ్ర నిర్మాత దిల్ రాజు ఈ భామపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. కాగా, ఈ సినిమా త్వ‌ర‌లో ఆహా ఓటీటీలో ప్ర‌సారం కాబోతోంద‌ని కూడా సమాచారం అందుతోంది.