ఎఫ్ 3 (F3) సినిమా ప్రమోషన్ : డైరెక్టర్ అనిల్ రావిపూడి సందడి

Published on May 11, 2022 12:33 PM IST

అనిల్ రావిపూడి మేకింగ్, టేకింగ్, అండ్ రైటింగ్‌తో F 3 సినిమాకి డబుల్ వినోదాన్ని అందించబోతున్నాడు. ఈ సినిమాలో వెంకీ, వరుణ్ తేజ్‌ల సరసన తమన్నా, మెహ్రీన్‌లు నటిస్తుండగా.. చాదస్తపు అత్తల పాత్రలలో అన్నపూర్ణమ్మ, ప్రగతి కూడా తమ మార్కు నటను ప్రదర్శించబోతున్నారు. వీరి పాత్రలు రెండో భాగంలోనూ కంటిన్యూ అవుతున్నాయి. 

ఇంకా ఇదే చిత్రంలో రాజేంద్రప్రసాద్ ఓ వెరైటీ పోలీస్ పాత్రలో నవ్వించబోతున్నారు. సునీల్ కూడా తనదైన స్టైల్లో కామెడీ పండించబోతున్నాడు. వెంకటేశ్ (Venkatesh), వరుణ్ తేజ్​ తమ హిలేరియస్ కామెడీతో ట్రైలర్ నిండా సందడి చేశారు.

కామెడీ టైమింగ్ లో తిరుగులేని వెంకీ, తెలంగాణ యాసలో అదరగొట్టబోతున్న వరుణ్ తేజ్ ఈ సినిమాతో ఈ సమ్మర్ మొత్తాన్ని కేప్చర్ చేస్తారని అనిపిస్తోంది.

తాజాగా ఈ సినిమా ప్రమోషనల్ ఈవెంట్‌లో అనిల్ రావిపూడి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేకరులతో కొంచెంసేపు ముచ్చటించారు. సరిలేరు నీకెవ్వరు, పటాస్, రాజా ది గ్రేట్ లాంటి సినిమాలు అనిల్‌కు మంచి పేరు తీసుకొచ్చాయి.