‘లైగర్’ (Liger) ఎఫెక్ట్: పూరీ జగన్నాథ్ (Puri Jagannadh)కు బెదిరింపులు.. 27న ధర్నా చేస్తామని బయ్యర్ల వార్నింగ్!

ఛార్మి కౌర్, పూరి జగన్నాథ్, కరణ్ జోహార్ నిర్మాతలుగా రూపొందిన పాన్ ఇండియా ఫిలిం ‘లైగర్’ (Liger) భారీ డిజాస్టర్‌ అయ్యింది.

టాలీవుడ్ దర్శక నిర్మాత పూరీ జగన్నాథ్ (Puri Jagannadh), రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) కాంబినేషన్‌లో భారీ అంచనాల మధ్య విడుదలైన చిత్రం ‘లైగర్’ (Liger).  సినిమాను పూరీ కనెక్టస్ మరియు ధర్మ ప్రొడక్షన్స్ పతాకంపై భారీ ఖర్చుతో పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కించారు. ఈ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోవడంలో విఫలమయింది. విడుదలైన ప్రతీ చోటా నష్టాలనే మిగిల్చింది. డిస్ట్రిబ్యూటర్స్ కూడా నష్టాల బాట పట్టారు.

మరీ ముఖ్యంగా నైజాం ఏరియాలో భారీ రేటుకు కొనుగోలు చేయడంతో.. పెద్ద దెబ్బ అక్కడి వారికే పడ్డట్టు అయింది. అందుకే నైజాంకు చెందిన  83మంది ఎగ్జిబిటర్స్ అంతా కలిసి పూరి జగన్నాథ్ ఆఫీస్ ముందు ధర్నాకు దిగాలని అనుకుంటున్నారట. కొందరు డిస్ట్రిబ్యూటర్స్ పూరీకి ఫోన్ చేసి ధర్నా చేస్తామని బెదురుస్తున్నారట. 

పూర్తి వివరాల్లోకి వెళితే.. ఛార్మి కౌర్, పూరి జగన్నాథ్, కరణ్ జోహార్ నిర్మాతలుగా రూపొందిన పాన్ ఇండియా ఫిలిం ‘లైగర్’ (Liger) భారీ డిజాస్టర్‌ అయ్యింది. ఈ సినిమాకు ఉన్న క్రేజ్ దృష్ట్యా బయ్యర్లు భారీ ధరకే కొనుగోలు చేశారు. కానీ, ఫలితం తారుమారు అవడంతో తీవ్రంగా నష్టపోయారు. దీంతో తమను ఆదుకోవాలని పూరీ జగన్నాథ్‌ను బయ్యర్లు కోరారు. 

అందుకు పూరి జగన్నాథ్ (Puri Jagannadh) సరేనని అన్నారు. అయితే... కొంత సమయం అడిగారు. అందుకు, ఎగ్జిబిటర్లు రెడీగా లేరట!  తాము నష్టపోయిన మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈనెల 27న పూరి జగన్నాథ్ ఇంటి ముందు ధర్నా చేయడానికి రెడీ అవుతున్నారట. ఈ మేరకు వాట్సాప్‌లో ఓ మెసేజ్ చక్కర్లు కొడుతోంది.

 “ఏంటి బ్లాక్మెయిల్ చేస్తున్నారా? నేను ఎవరికీ డబ్బు తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు, అయినా ఇస్తున్నాను. ఎందుకు? పాపం వాళ్ళు కూడా నష్టపోయారులే అని. ఒక నెలలో అగ్రీ ఐన అమౌంట్ ఇస్తా అని చెప్పను. ఇస్తాను అని చెప్పాక కూడా అతి చేస్తే ఇచ్చేది కూడా ఇవ్వబుద్ధి కాదు. ఎందుకు ఇస్తున్నాం? పరువు కోసం ఇస్తున్నాం. నా పరువు తియ్యాలి అని చూస్తే మాత్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వను” అంటూ మండిపడ్డాడు.

‘‘ఎగ్జిబిటర్లకు నాకు సంబంధమేంటి? ఇక్కడ అందరం గ్యాంబ్లింగ్ చేస్తున్నాం.. పేకాడ ఆడుతున్నాం. కొన్ని ఆడతాయి.. కొన్ని పోతాయి. పోతే నేను ఎవరినైనా అడుగుతున్నానా? వీళ్లు మగాళ్లు కాదు.. ఒక్కడు లేడు ఇక్కడ. అదే సినిమా హిట్ అయితే బయ్యర్ల దగ్గర వసూలు చేయడానికి నానా సంకలు నాకాలి నేను’’ అని కోప్పడ్డాడు పూరీ జగన్నాథ్

‘పోకిరి’ (Pokiri Movie) దగ్గర నుంచి ‘ఇస్మార్ట్ శంకర్’ వరకు బయ్యర్స్ దగ్గర నుంచి నాకు రావాల్సిన డబ్బులు ఎన్నో ఉన్నాయి. బయ్యర్స్ అసోసియేషన్ నాకు వసూలు చేసి పెడతుందా?’’ అని పూరీ జగన్నాథ్ ప్రశ్నించారు. ధర్నా చేస్తాం అంటున్నారు. చెయ్యండి. ధర్నా చేసిన వాళ్ళ లిస్ట్ తీసుకోని, వాళ్ళకి తప్ప మిగతావాళ్ళకి ఇస్తా' అంటూ వార్నింగ్ ఇచ్చాడు.

Read More: 'లైగర్' (Liger) డిజాస్టర్ తో పారితోషికంలో భారీ మొత్తం తిరిగిచ్చేసిన విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)..?

Credits: pinkvilla
You May Also Like These