ఎఫ్ 3 (F3) సినిమా ప్రమోషన్ : ఫోటో షూట్‌లో తమన్నా

Published on May 11, 2022 12:18 PM IST

మిల్కీ బ్యూటీ తమన్నా.. ఎఫ్ 2 సినిమాలో భర్తను సతాయించే భార్యగా, తన పాత్రను అలవోకగా పోషించింది. అలాగే మెహ్రీన్‌తో కలిసి ఈమె చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. ఇప్పుడు F 3 సినిమాలో కూడా తన మార్కు నటనతో ప్రేక్షకులను అలరించడానికి తమన్నా సిద్ధమవుతోంది. 

ఇటీవలే హైదరాబాద్‌లో ఎఫ్ 3 ప్రమోషన్లలో భాగంగా జరిగిన ఫోటో షూట్ కార్యక్రమంలో తమన్నా పాల్గొంది. కెమెరామెన్లకు ఫోజులిచ్చింది. తమన్నా అసలు పేరు తమన్నా భాటియా. 2005లో చాంద్ సా రోషన్ చెహ్రా అనే సినిమాతో చిత్రపరిశ్రమలోకి ఈమె అడుగుపెట్టింది. అదే ఏడాది శ్రీ సినిమాతో తెలుగు పరిశ్రమకు పరిచయమైంది. 2006లో కేడీ చిత్రంతో తమిళంలోకి కూడా అడుగుపెట్టింది. 

2007లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన టాలీవుడ్ చిత్రం హ్యాపీ డేస్ తమన్నాకు మంచి పేరు తీసుకొచ్చింది. ఆ తర్వాత బాలాజీ శక్తివేల్ దర్శకత్వంలో వచ్చిన తమిళ్ సినిమా కళ్ళూరి తమన్నా కెరీర్‌లోనే ఉత్తమ చిత్రంగా నిలిచింది. 100 % లవ్, తడాఖా, కెమెరామాన్ గంగతో రాంబాబు, బాహుబలి లాంటి సినిమాలు తమన్నాకు తెలుగులో మంచి పేరు తీసుకొచ్చాయి.