రుక్సార్ ధిల్లాన్ (Rukshar Dhillon) : టాలీవుడ్‌ని షేక్ చేస్తున్న ఉత్తరాది భామ

Published on May 11, 2022 06:32 PM IST

రుక్సార్ ధిల్లాన్ (Rukshar Dhillon) ఎవరో తెలుసా? లండన్‌లో పుట్టి పెరిగిన ఈ పంజాబీ భామ ప్రస్తుతం తెలుగు సినిమాలలో తన లక్‌ను పరీక్షించుకుంటోంది.  ఆకతాయి, కృష్ణార్జున యుద్ధం, ఏబీసీడీ వంటి తెలుగు చిత్రాలలో నటించిన ఈ ఉత్తరాది భామ, 2020లో  హిందీ చిత్రం "భాంగ్రా పా లే"లో కూడా నటించింది. ఇటీవలే విడుదలైన తెలుగు చిత్రం "అశోకవనంలో అర్జున కళ్యాణం"  రుక్సార్‌కు మంచి పేరు తీసుకొచ్చింది. 

కన్నడంలో వినయ్ రాజ్ కుమార్ సరసన తొలిసారిగా "రన్ ఆంటోనీ" సినిమాలో నటించిన రుక్సార్, ఆ చిత్రానికి గాను విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ప్రస్తుతం "జుగాడిస్తాన్" అనే మరో హిందీ చిత్రంలో కూడా నటిస్తోంది. 

"అశోకవనంలో అర్జున కళ్యాణం (Ashoka Vanamlo Arjuna Kalyanam)" చిత్రంలో కథానాయికగా రుక్సార్‌కు మంచి మార్కులే పడ్డాయి. సోషల్ మీడియాలో బాగా యాక్టివ్‌గా ఉండే ఈమెకు ఇన్‌స్టాగ్రాంలో 5 లక్షలకు పైగానే ఫాలోవర్లు ఉన్నారు.