విశ్వక్ సేన్ (Vishwak Sen) : సక్సెస్ మీట్ విత్ ఫ్యాన్స్

Published on May 11, 2022 12:51 PM IST

ఈ నగరానికి ఏమైంది, ఫలక్ నామాదాస్, హిట్, పాగల్ లాంటి సినిమాలతో బాగా పాపులర్ అయిన నటుడు విశ్వక్ సేన్. ఈ మధ్యకాలంలో ఈయన నటించిన అశోకవనంలో అర్జున కళ్యాణం అనే సినిమా హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమా విడుదలకు ముందే, విశ్వక్ తన సినిమా ప్రమోషన్ కోసం ఓ ప్రాంక్ వీడియో చేసి చిన్న వివాదంలో ఇరుక్కున సంగతి తెలిసిందే. 

తాజాగా ఈ సినిమా హిట్ అయ్యాక, విశ్వక్ థియేటర్ల వద్ద ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్ కార్యక్రమాలలో మాట్లాడారు. తన మదిలోని మాటను పంచుకున్నారు. సినిమాను ఈ స్థాయిలో హిట్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలని, మంచి సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఎల్లప్పుడూ ఆదరిస్తారని తెలిపారు. 

అశోకవనంలో అర్జున కళ్యాణం చిత్రంలో రుక్సర్ థిల్లాన్, రితికా నాయక్ కథానాయికలుగా నటించారు. చింతా విద్యాసాగర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రానికి రవికిరణ్ కోలా కథా సహకారం అందించారు. భోగవల్లి బాపినీడు నిర్మాతగా వ్యవహరించగా, జయ్ క్రిష్ సంగీతాన్ని సమకూర్చారు. ప్రస్తుతం ఈ సినిమా బాక్సాఫీసు వద్ద రూ. 3 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి, హిట్ చిత్రంగా నిలిచింది.