ఎఫ్ 3 (F3) సినిమా ప్రమోషన్ : అభిమానులతో విక్టరీ వెంకటేష్

Published on May 11, 2022 11:22 AM IST

ఫన్​ అండ్​ ఫ్రస్టేషన్​ అంటూ "ఎఫ్​ 2" తో సంక్రాంతి అల్లుళ్లుగా వచ్చి హిట్​ కొట్టిన విక్టరీ వెంకటేష్​, వరుణ్​ తేజ్.. ​ ఈసారి "ఎఫ్​ 3" తో  ‘సమ్మర్​ సోగ్గాళ్లు’గా రానున్నారు.  ఆధునిక జంధ్యాలగా పేరు దక్కించుకున్న  అనిల్​ రావిపూడి ఈ సినిమాకి దర్శకుడు.  

వేసవి కానుకగా మే 27న ప్రేక్షకుల ముందుకు రానున్న ఎఫ్​ 3 ట్రైలర్​ను ఇటీవలే  చిత్రబృందం విడుదల చేసింది.  ట్రైలర్‌లోని సన్నివేశాలు, నటీనటుల డైలాగ్స్‌ చూస్తే ‘ఎఫ్‌-2’తో పోలిస్తే ‘ఎఫ్‌-3’లో ఫన్‌ డోస్‌ మరింత పెరిగినట్లు అర్థమవుతోంది.

‘‘ప్రపంచానికి తెలిసిన పంచభూతాలు అయిదే. కానీ ఆరో భూతం ఒకటి ఉంది. అదే డబ్బు’’ అంటూ ఓ కొత్త సిద్ధాంతంతో ప్రేక్షకులను అలరించడానికి వచ్చేస్తున్న సినిమా F 3. ఈ సినిమాలో ఓ వైపు రేచీకటి వ్యక్తిగా వెంకీ.. నత్తి ఉన్న వ్యక్తిగా వరుణ్‌ ఇచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్‌ పీక్స్‌లో ఉండబోతుందని టాక్. 

ఇటీవలే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో నటుడు వెంకటేష్ సందడి చేశారు. అభిమానులతో కాసేపు ముచ్చటించారు.